నిర్మల్ జిల్లా ఉడుంపూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు దుర్మరణం చెందారు. కవ్వాల్ పంచాయతీ సోనాపూర్ తాండకు చెందిన బాలాజీ అక్కడిక్కడే మృతి చెందగా.. ఆయన భార్య, కూతురుకి స్వల్ప గాయాలయ్యాయి. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్‌లో జరిగిన శుభకార్యానికి భార్య, కూతురుతో ద్విచక్రవాహనంపై వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించే క్రమంలో అదపుతప్పి చెట్టును ఢీకొట్టినట్లు తెలుస్తోంది.
ఇవీ చూడండి: సినిమాను తలపించే పోలీసుల ఛేజ్..ముగ్గురు సేఫ్