ETV Bharat / state

ప్లాస్మా దానం: పుట్టినరోజునే మరో వ్యక్తికి పునర్జన్మ

కరోనాతో పోరాడుతోన్న ఓ బాధితుడికి ప్లాస్మా దానం చేసి ప్రాణాలను నిలబెట్టాడు. తన పుట్టినరోజునే మరో వ్యక్తికి పునర్జన్మనిచ్చాడు. ఆపదలో అండగా నిలిచి శెభాష్ అనిపించుకున్నాడు నిర్మల్​ జిల్లాకు చెందిన లక్ష్మణ్​ అనే వ్యక్తి.

author img

By

Published : Sep 6, 2020, 11:06 AM IST

A young man donated plasma to a corona victim in Nirmal district
ప్లాస్మా దానం: తన పుట్టినరోజునే మరో వ్యక్తికి పునర్జన్మ

నిర్మల్ జిల్లా కేంద్రంలోని బంగల్​పేట్​కు చెందిన బత్తుల లక్ష్మణ్ అనే వ్యక్తి కొద్దిరోజుల క్రితం కరోనా బారినపడ్డారు. 14 రోజుల చికిత్స అనంతరం వైరస్ నుంచి కోలుకున్నాడు. ఈ క్రమంలో పట్టణంలోని సోఫీనగర్​కు చెందిన జనార్దన్ అనే వ్యక్తి కొవిడ్​తో బాధపడుతూ హైదరాబాద్​లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పరిస్థితి విషమంగా ఉండటం వల్ల బీ పాజిటివ్ ప్లాస్మా అవసరమవుతుందని వైద్యులు సూచించారు.

స్థానికంగా రక్తదాతల వాట్సాప్ గ్రూప్​ నిర్వహిస్తోన్న నిగులపు సంజీవ్ అనే వ్యక్తికి విషయం తెలిసింది. వెంటనే సంజీవ్​ లక్ష్మణ్​కు సమాచారం అందించాడు. ఇద్దరూ కలసి హైదరాబాద్​కు చేరుకుని బాధితుడికి రక్తం అందించారు. లక్ష్మణ్​ తన పుట్టినరోజునే ప్లాస్మా దానం చేయడం పట్ల బాధిత కుటుంబ సభ్యులు అతనికి కృతజ్ఞతలు తెలిపారు.

ఇదీచూడండి.. మారటోరియం.. ఈఎంఐల భారం తగ్గాలంటే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.