నిర్మల్ జిల్లా ముధోల్ మండలం అష్టా గ్రామానికి చెందిన భరత్ చిన్న వయస్సులోనే తలసేమియా వ్యాధి బారినపడ్డాడు. అతనికి నెలకోసారి రక్తాన్ని ఎక్కించాలి. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రికి వచ్చారు. స్థానిక బ్లడ్ బ్యాంక్లో రక్త నిల్వలు లేకపోవడం, కరోనా నేపథ్యంలో రక్తదాతలు ముందుకు రాకపోవడం వల్ల ఆ చిన్నారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. బాధితునికి ఏ పాజిటివ్ రక్తం అవసరం ఉందని బ్లడ్ బ్యాంక్ సిబ్బంది వాట్సప్ గ్రూప్లో పోస్ట్ చేశారు.
దానికి వెంటనే స్పందించిన పోలీస్ కానిస్టేబుల్ సంతోశ్ కుమార్ ఆన్ డ్యూటీలో వచ్చి రక్తదానం చేసి తన ఉదారతను చాటుకున్నారు. తలసేమియా బాధితులకు రక్తం దొరకడం కష్టంగా మారిందని, చిన్నారుల జీవితాలు నిలబెట్టేందుకు ప్రతి ఒక్కరు రక్తదానం చేయడానికి ముందుకు రావాలని కానిస్టేబుల్ విజ్ఞప్తి చేశారు. తమ బిడ్డ ప్రాణాలను కాపాడడానికి సాయం చేసిన సంతోశ్కు భరత్ తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీ చూడండి: 'తీవ్రవాదం ఏ రూపంలో ఉన్నా భారత్ సహించదు'