దుబాయ్లో తెలంగాణ వాసి ప్రాణాలు విడిచాడు. బతుకుదెరువు కోసం వెళ్లి.. అక్కడే ఆత్మహత్య చేసుకున్నాడు. నిర్మల్ జిల్లా సోన్ మండలంలోని కడ్తాల్ గ్రామానికి చెందిన బాశెట్టి పోశెట్టి (40) దుబాయ్లో ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. బతుకుదెరువు కోసం గత ఐదు సంవత్సరాల క్రితం దుబాయ్ వెళ్లాడు. అక్కడ ఓ కంపెనీలో పని చేస్తున్నాడు. కరోనా వైరస్ నేపథ్యంలో కంపెనీ యజమాన్యం కొన్ని నెలలుగా జీతం ఇవ్వకపోవడం, చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక మనస్తాపానికి గురై గురువారం గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఈ మేరకు దుబాయ్ నుంచి గ్రామస్థులు, కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలున్నారు. పోశెట్టి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ప్రభుత్వం, నాయకులు స్పందించి మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువచ్చేలా చర్యలు చేపట్టాలని, కుటుంబాన్ని ఆదుకోవాలని తెలంగాణ వలస కార్మికుల సంక్షేమ సంఘం అధ్యక్షులు పోతుగంటి సాయేందర్ కోరారు.
ఇవీ చూడండి: విషాదం... యంత్రంలో పడి బాలుడి మృతి