అధికారుల కళ్లు కప్పి, ఎవరికి అనుమానం రాకుండా ఆర్టీసీ బస్సులో గంజాయి తరలించేందుకు పథకం వేసుకున్న ఇద్దరిని ఎక్సైజ్ పోలీసులు ప్రయాణ ప్రాంగణంలో అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌కు చెందిన శివాజి చౌహాన్, రాఠోడ్ భీంసింగ్... ఆదిలాబాద్‌కు చెందిన జైవంత్ అనే వ్యక్తి నుంచి 8 కిలోల గంజాయి కొనుగోలు చేసి బ్యాగుల్లో పెట్టుకుని హైదరాబాద్ వెళ్లేందుకు నిర్మల్ జిల్లా కేంద్రంలోని బస్టాండుకు వచ్చారు.
పోలీసులకు సమాచారం అందడం వల్ల ప్రయాణికులను తనిఖీ చేస్తుండగా గంజాయి తరలిస్తున్న ఇద్దరు పట్టుబడ్డారు. ఇద్దరిని అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ.40 వేలు విలువ చేసే 8 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ సీఐ సంపత్ కృష్ణ తెలిపారు.
ఇదీ చూడండి: దొంగతనం కేసును ఛేదించిన పోలీసులు