Bandi Sanjay 5th phase Praja Sangrama Yathra: భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర 5వ విడత అక్టోబర్ 15 నుంచి ప్రారంభం కానుంది. నిర్మల్ జిల్లా భైంసా నుంచి కరీంనగర్ వరకు పాదయాత్ర సాగనుంది. బాసర అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసిన అనంతరం బండి సంజయ్ భైంసా నుంచి పాదయాత్రను ప్రారంభిస్తారు.
బండి సంజయ్ ఇప్పటి వరకు నాలుగు విడతల్లో 48 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 1,260 కిలోమీటర్ల మేర పాదయాత్రను పూర్తి చేశారు. గతేడాది ఆగస్టు 28న చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం నుంచి తొలి విడత పాదయాత్రను ప్రారంభించిన విషయం తెలిసిందే.
ఇవీ చూడండి..
అర్ధరాత్రి హోంమంత్రికి అపరిచిత వ్యక్తి ఫోన్‌కాల్.. ఎందుకో తెలుసా..!
ఏసీ గది.. ఆక్సీమీటర్‌తో టెస్ట్.. గంగాజలంతో స్నానం.. ఇంట్లోనే శవంతో ఏడాదిన్నర ఇలా చేశారట!