నారాయణ పేట జిల్లా సంగంబండ రిజర్వాయర్ నంచి మక్తల్ పట్టణ పెద్దచెరువుకు ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి నీటిని విడుదల చేశారు. ఖానాపూర్ లిఫ్ట్ నుంచి నీటి తరలింపును ఆయన ప్రారంభించారు. పెద్దచెరువు కింద వందలాది ఎకరాలు సాగవుతున్నాయని పేర్కొన్నారు.
ప్రస్తుత సీజన్లో చెరువును నీటితో నింపి రైతులకు క్రమపద్ధతిలో విడుదల చేస్తామని వెల్లడించారు. మక్తల్ పెద్దచెరువు నిండితే..పట్టణంలోని భూగర్భజలాలు పెరిగి బోర్లలో నీటిమట్టం పెరుగుతాయని తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్ ఛైర్మన్ రాజేశ్ గౌడ్, ఈఈ చక్రధర్ తదితరులు పాల్గొన్నారు.