అక్రమంగా రవాణా చేస్తున్న 25 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్న ఘటన... నారాయణపేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. అక్రమ బియ్యం రవాణా చేస్తున్న వాహనాలను చాకచక్యంగా పట్టుకొని కేసులు నమోదు చేస్తున్నప్పటికీ… కళ్ళెం పడటం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు నామమాత్రం దాడులు నిర్వహిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
బొమ్మన్ పాడు నుంచి కర్ణాటక రాష్ట్రం గురుమిత్కల్ కు అక్రమంగా తీసుకెళ్తుండగా… అమ్మిరెడ్డి పల్లి శివారులో టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించి పట్టుకున్నారు. నారాయణపేట పోలీస్ స్టేషన్ పరిధిలో రేషన్ బియ్యం అమ్మినా, అక్రమ రవాణా చేసినా, అక్రమంగా నిల్వ ఉంచినా… చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.