ETV Bharat / state

వెబ్‌ డిజైనర్‌గా రాణిస్తూ.. రికార్డ్స్ కొల్లగొడుతున్న ఇంటర్ విద్యార్థి

Special Story on Youngest Web Designer : కొవిడ్ లాక్‌డౌన్‌ సమయాన్ని కొందరు ఖాళీగా కుటుంబంతో గడిపేందుకు వాడుకున్నారు. మరికొందరు కొత్త విషయాలు నేర్చుకునేందుకు ఉపయోగించుకున్నారు. ఈ యువకుడు రెండో కోవకు చెందినవాడే. అతి తక్కువ సమయంలో 20 వెబ్‌సైట్లు డిజైన్‌ చేసి ఇంటర్నేషనల్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నాడు. అంతేకాదు.. అత్యంత పిన్న వయసు గల వెబ్‌ డిజైనర్‌గా ప్రఖ్యాతి పొందిన నారాయణపేట జిల్లా యువకుడిపై ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం.

Youngest Web Designer
Youngest Web Designer
author img

By

Published : Mar 13, 2023, 5:39 PM IST

వెబ్‌ డిజైనర్‌గా రాణిస్తూ.. రికార్డ్స్ కొల్లగొడుతున్న ఇంటర్ విద్యార్థి

Special Story on Youngest Web Designer: కృత్రిమమేధతో పరిజ్ఞానం కొత్తపుంతలు తొక్కుతున్నఈ రోజుల్లో సాంకేతికత అందిపుచ్చు కున్న యువతదే హవా. అలాంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని అతిపిన్న వయసులోనే ఔపోసన పట్టాడు ఈ కుర్రాడు. తక్కువ సమయంలో 20వెబ్ సైట్లు క్రియేట్‌ చేసిన పిన్నవయస్కునిగా రికార్డుల కెక్కాడు. తనంతట తానే నేర్చుకుంటూ నిత్యం జ్ఞాన సముపార్జన చేశాడు.

ఈ యువకుడి పేరు త్రిశాల్‌ దోమ. నారాయణపేట జిల్లా ఊట్కూరు మండల కేంద్రం వాసి. తండ్రి సుధాకర్‌ బోటనీ లెక్చరర్‌. తల్లి వాణి గృహిణి. ప్రస్తుతం మహబూబ్ నగర్ లోని ఓ ప్రైవేటు జూనియర్ కళాశాలలో ఇంటర్ చదువుతున్నాడు ఈ కుర్రాడు. నిత్యం ఏదో నేర్చుకోవాలనే జిజ్ఞాస కలిగి ఉండేవాడు. అలా కొవిడ్‌ సమయంలో వెబ్‌ డిజైనింగ్‌ వైపు అడుగులు వేశాడు. తన వెబ్‌సైట్స్‌ సమాజానికి, రైతులకు ఉపయోగపడేలా ఉండాలనుకున్నాడు త్రిశాల్‌. 8వ తరగతిలో ఉన్నప్పుడే వెబ్‌డిజైనింగ్‌కు సంబంధించిన బేసిక్స్‌ నేర్చుకున్నాడు. వాటితో పాటు స్వతహాగా కొన్ని మెళకువలు పెంపొందించుకున్నాడు. తర్వాత వెబ్‌ డిజైనింగ్‌ మొదలుపెట్టి తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉండాలని నిర్ణయించుకున్నాడు. తగ్గట్టుగా కష్టపడ్డాడు. విభిన్నాంశాలపై వెబ్‌సైట్స్‌ క్రియేట్‌ చేశాడు.

'నేను 8వ తరగతిలో ఉన్నప్పుడు మా అక్క ప్రోత్సాహంతో వెబ్ డిజైనింగ్ మీద మరింత మక్కువ పెరిగింది. 2 గంటలలో నా మొదటి వెబ్​సైట్ క్రియేట్ చేశాను. తర్వాత ప్రాక్టీస్​లో 1.30గంటలకు, ఆతర్వాత చివరకు 45 నిమిషాలలో పూర్తి చేయగలిగాను. దీనికి నాకు డిసెంబర్ 16న ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్​ నుంచి అవార్డు రావడం జరిగింది. మా నాన్న వల్ల వెబ్ డిజైనింగ్ చేయాలనే ఆలోచన వచ్చింది. రెస్టారెంట్లు, స్కూళ్లు, రైతులకు సంబంధించిన కొన్ని వెబ్​సైట్స్ నేను క్రియేట్ చేశాను. మొత్తం 7 విభాగాలకు చెందిన వెబెసైట్లు రూపొందించాను. చదువయ్యాక వెబ్ డెవలపర్​గా రాణిస్తాను.'-త్రిశాల్, వెబ్​ డిజైనర్

చిన్నపిల్లాడే అయినా 13ఏళ్ల వయసులోనే త్రిశాల్ రికార్డుల్లోకెక్కాడు. తన ప్రతిభకు తానే పరీక్ష పెట్టుకుని 12గంటల్లో 20వెబ్ సైట్లు అభివృద్ధి చేశాడు. తక్కువ సమయంలో ఎక్కువ వెబ్ సైట్లు అభివృద్ధి చేసిన పిన్న వయస్కుడిగా ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్​లో చోటు దక్కించుకున్నాడు. పైథాన్ నేర్చుకుని ఆడ్వాన్స్‌డ్ వర్ష న్ సర్టిఫైడ్ డెవలపర్​గా గుర్తింపు పొందాడు త్రిశాల్‌. ఇప్పటి వరకూ 40కి పైగా వెబ్ సైట్లు అభివృద్ది చేశాడు. సంగీతం, విద్యా, విద్యాసంస్థలు, ఆహారం, హోటళ్లు ఇలా 7విభాగాలకు చెందిన వెబ్ సైట్లు అభివృద్ధి చేశాడు. 10వ తరగతిలో చివరి వెబ్‌సైట్‌ డిజైన్‌ రూపొందించాడు. ప్రస్తుతం చదువుపై దృష్టి సారిస్తున్నాడు ఈ కుర్రాడు.

ఐఐటీ ముంబయిలో సీటు సంపాదించడమే లక్ష్యంగా ఇంటర్ చదుతువుతున్న త్రిశాల్.. చదువయ్యాక వెబ్ డెవలపర్‌ రాణిస్తానంటున్నాడు. అమెరికా, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో విపరీతమైన ఆదరణ ఉన్న వెబ్ డిజైనింగ్ కు ఇండియాలోనూ మంచి భవిష్యత్తు ఉందని అంటున్నాడు. చిన్నవయసులోనే ప్రతిభా పాటవాలు ప్రదర్శించి రికార్డులు సాధించి తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నాడు త్రిశాల్. ఈ క్రమంలో సహాయం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెబుతున్నాడు. చిన్న వయసులోనే రికార్డులు సాధించడం పట్ల అతని తల్లిదండ్రులు, గురువులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 13 ఏళ్లకే రికార్డులు క్రియేట్‌ చేసే జ్ఞానాన్ని సంపాదించిన త్రిశాల్‌.. చదువులోనూ మరింత ముందుకెళ్లాలని ఆశిద్దాం. తన కోరిక మేరకు ఐఐటీ ముంబైలో చదువు పూర్తి చేసి రాబోయే కాలంలో అతడు వెబ్‌ డిజైనింగ్‌లో ఉన్నతి సాధించాలని కోరుకుందాం.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.