ETV Bharat / state

లాభం వచ్చినప్పుడు అమ్ముకోవచ్చు : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి - singireddy in narayana peta district

రైతులకు అవసరమైన అన్నీ సదుపాయాలు సమకూర్చేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తెలిపారు. ధన్వాడ మండలంలో రూ. 3 కోట్ల నిధులతో నిర్మించిన వ్యవసాయ గిడ్డంగిని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో కలిసి ప్రారంభించారు.

singireddy niranjan reddy inaugurated  an agricultural warehouse built at  dhanwada with tourism minister srinivas Gowda
లాభం వచ్చినప్పుడు అమ్ముకోవచ్చు : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
author img

By

Published : Dec 29, 2020, 12:12 AM IST

రాష్ట్రంలో సాగునీటి సౌలభ్యం పెరిగినందున రైతులకు అవసరమైన అన్నీ సదుపాయాలు సమకూర్చేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. నారాయణ పేట జిల్లాలోని ధన్వాడ మండలంలో రూ. 3 కోట్ల నిధులతో నిర్మించిన వ్యవసాయ గిడ్డంగిని, ధన్వాడ క్లస్టర్ రైతు వేదిక, వ్యవసాయ యంత్రాల అద్దె కేంద్రాలను పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్​తో కలిసి ఆయన ప్రారంభించారు.

రాబోయే రోజుల్లో ..

నూతనంగా ప్రారంభించిన గిడ్డంగిలో 25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం నిలువ చేసుకునే విధంగా ఏర్పాటు చేశామన్నారు. దీని ద్వారా రైతులు తాము పండించిన పంటను గోదాములో నిల్వ చేసుకొని లాభం వచ్చినప్పుడు అమ్ముకోవచ్చని తెలిపారు. రాబోయే రోజుల్లో 40 లక్షల మెట్రిక్ టన్నుల నిలువ సామర్థ్యం కలిగిన గోదాములు, కోల్డ్ స్టోరేజ్​ల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.

దేశంలో ఎక్కడ లేని విధంగా..

రాష్ట్రంలో రైతుల కోసం సీఎం అహర్నిశలు కృషి చేస్తున్నారని చెప్పారు. అందులో భాగంగా .. రైతులకు దేశంలోనే ఎక్కడా లేని విధంగా రైతుబంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత విద్యుత్​తో పాటు రైతు వేదికలు, కల్లాలు, సబ్సిడీపై ఆధునిక యంత్రాల పంపిణీ కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు.

ఇష్టమొచ్చిన పంటను వేసుకునేందుకు..

రైతులకు అన్నీ విధాలుగా ఉపయోగపడే విధంగా రాష్ట్రంలో రూ. 700 కోట్ల ఖర్చుతో 2600 రైతు వేదికల నిర్మాణాలు చేపట్టి పూర్తి చేయడం జరిగిందన్నారు. రైతులు తమ పొలంలో తమకు ఇష్టమొచ్చిన పంటను వేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించిందని తెలియజేశారు.

రైతులకు మేలు జరుగుతుంది

కేంద్రప్రభుత్వం కొత్త వ్యవసాయ చట్టాల వల్ల రైతులకు మేలు జరిగితే సంతోషమేనని.. ఏదైనా కొత్త చట్టాన్ని రైతులు అవలంభించినప్పుడే తెలుస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో.. మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యులు మన్నె శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కలెక్టర్ డి. హరిచందన, స్థానిక శాసన సభ్యులు యస్. రాజేందర్ రెడ్డి, మక్తల్ శాసన సభ్యులు చిట్టెం రామ్మోహన్ రెడ్డి, అదనపు కలెక్టర్ చంద్రా రెడ్డి, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు వెంకట్ రెడ్డి, ఆర్డీవో శ్రీనివాసులు, ప్రజాప్రతినిధులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను మోసం చేస్తున్నాయి: ఉత్తమ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.