కర్ణాటక నుంచి నారాయణపేట జిల్లాకు వచ్చే వాహనాలను, ప్రయాణికులను పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. ఎస్పీ డాక్టర్ చేతన ఆదేశాల మేరకు చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నట్లు సీఐ శ్రీకాంత్ రెడ్డి తెలిపారు.
ఎవరైనా అనుమానితులు ఉన్నారేమో అని వైద్యబృందంతో కలిసి తనిఖీలు నిర్వహిస్తున్నారు. ముంబై నుంచి వచ్చే వారిని స్క్రీనింగ్ చేస్తున్నట్లు వెల్లడించారు. కరోనా బారిన పడకుండా వైద్యులు పలు సూచనలు చేస్తున్నారు. వ్యక్తిగత పరిశుభ్రతపై దృష్టిపెట్టాలని... బస్సుల్లోనూ, వాహనాల్లోనూ ప్రయాణించే సమయంలో పలు జాగ్రత్తలు పాటించాలన్నారు. బస్టాండ్లలో శానీటైజర్లును ఏర్పాటు చేసి... ప్రాంగణాలన్ని రసాయనాలతో పిచికారీ చేయిస్తున్నారు.
ఇవీచూడండి: కరోనా ఎఫెక్ట్: వారాంతపు సంత మూసివేత