ఆర్టీసీ ఐకాస తలపెట్టిన ఛలో ట్యాంక్‌బండ్ కార్యక్రమంలో తీవ్ర ఉద్రిక్తంగా మారింది. కార్యక్రమంలో పాల్గొనేందుకు రాష్ట్రవ్యాప్తంగా తరలివచ్చిన కార్మికులు ఒక్కసారిగా ట్యాంక్‌బండ్‌వైపు రాగా... పోలీసులు లాఠీఛార్జ్ నిర్వహించారు. ఈ ఘటలో పలువురు కార్యకర్తలకుగాయాలయ్యాయి. నారాయణపేట డిపోకు చెందిన డ్రైవర్ నాగేంద్ర మోకాళ్లపై లాఠీఛార్జ్ చేయగా... తీవ్రంగా గాయపడ్డాడు. నడవలేని స్థితిలో నాగేంద్ర... తెలుగు తల్లి విగ్రహం వద్ద కుప్పకూలిపోయాడు. క్షతగాత్రున్ని తార్నాకలోని ఆర్టీసీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కార్మికుల పట్ల పోలీసులు ఇంత అమానుషంగా ప్రవర్తించటం సరికాదని కార్మికులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
ఇవీ చూడండి: ఛలో ట్యాంక్‌బండ్ ఉద్రిక్తం... బాష్పవాయువు ప్రయోగం..