ETV Bharat / state

"ప్రతి ఒక్కరూ మెుక్కలు నాటాలి" - cmo osd

నారాయణపేట జిల్లా మక్తల్​ సమీపంలో నిర్మించనున్న రైల్వేస్టేషన్​ పరిసరాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి  ఓఎస్డీ  ప్రియాంక వర్గీస్ మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరూ హరితహారంలో పాల్గొని విజయవంతం చేయాలని సూచించారు.

"ప్రతి ఒక్కరూ మెుక్కలు నాటాలి"
author img

By

Published : Jul 11, 2019, 1:01 AM IST

నారాయణపేట జిల్లా మక్తల్ సమీపంలో నిర్మించనున్న నూతన రైల్వే స్టేషన్ పరిసరాల్లో హరితహారం కార్యక్రమంలో భాగంగా మెుక్కలు నాటేందుకు శ్రీకారం చుట్టారు. మక్తల్ నుంచి దేవరకద్ర మధ్య 30 కిలోమీటర్ల పొడవునా నిర్మాణమవుతున్న రైల్వే ట్రాక్​కు ఇరువైపులా మొక్కలు నాటే కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఓఎస్డీ ప్రియాంక వర్గీస్​ పాల్గొన్నారు. హరితహారంలో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని సూచించారు. విద్యార్థులను ఉద్దేశించి మీరు ఉన్న పరిసరాలను హరిత వనాలుగా, పర్యావరణ హితంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నారాయణపేట జిల్లా కలెక్టర్ వెంకట్రావ్, మక్తల్ శాసనసభ్యులు చిట్టెం రాంమోహన్ రెడ్డి, ప్రభుత్వ అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Intro:Tg_mbnr_09_10_Harithaharam_Priyavargis_av_TS10092
రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయ ఓ ఎస్ డి ప్రియాంక వర్గీస్ మక్తల్ రైల్వే స్టేషన్ నిర్మాణం లోని హరితహారం కార్యక్రమంలో పాల్గొన్నారు.

Body:నారాయణపేట జిల్లా మక్తల్ సమీపంలో నిర్మించనున్న నూతన రైల్వే స్టేషన్ పరిసరాల్లో హరితహారంలో భాగంగా మక్తల్ నుంచి దేవరకద్ర మధ్య 30 కిలోమీటర్ల పొడవునా నిర్మాణమవుతున్న రైల్వే ట్రాక్ కు ఇరువైపులా మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ప్రియాంక వర్గీస్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమం హరితహారం అని ప్రతి ఒక్కరూ హరితహారం లో భాగంగా మొక్కలు నాటాలని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన విద్యార్థులను ఉద్దేశించి మీ ఇంటి పరిసరాలలో ,పాఠశాలలో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని తెలిపారు. హరితహారం లో భాగంగా కేవలం మొక్కలు నాటితే లక్ష్యం నెరవేరదు అవి మానులై ఎదిగే వరకు కంటికి రెప్పలా కాపాడాల్సిన బాధ్యత భావి పౌరులు పైనే ఉందని తెలియజేశారు. విద్యార్థులను ఉద్దేశించి మీరు ఉన్న పరిసరాలలో హరిత వరాలుగా, పర్యావరణ హితంగా తీర్చిదిద్దేందుకు మీరు కృషి చేయాలని కోరారు.

Conclusion:ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయ ఒస్డీ ప్రియాంక వర్గీస్, నారాయణ పేట జిల్లా కలెక్టర్ వెంకట్రావ్, మక్తల్ శాసనసభ్యులు చిట్టెం రాంమోహన్ రెడ్డి, ప్రభుత్వ అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.