ETV Bharat / state

ఉమ్మడి పాలమూరులో ప్రశాంతంగా ముగిసిన ఎన్నికలు - nrpt

సార్వత్రిక ఎన్నికల సమరంలో మొదటి విడత పోలింగ్ ముగిసింది. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని రెండు పార్లమెంట్​ స్థానాలకు ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. ఉదయం నుంచే ఓటర్లు బారులు తీరారు. అక్కడక్కడ ఈవీఎంలు మొరాయించి కొంతసేపు పోలింగ్ ఆగిపోయింది. పలు గ్రామాల్లో తమ సమస్యలు పట్టించుకోలేదని ప్రజలు పోలింగ్ బహిష్కరించారు.

ఉమ్మడి పాలమూరులో ముగిసిన ఎన్నికలు
author img

By

Published : Apr 11, 2019, 11:41 PM IST

ఈవీఎంల మొరాయింపులు, పోలింగ్ బహిష్కరణల నడుమ ఉమ్మడి పాలమూరు జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మహబూబ్​నగర్, నాగర్​కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గాల్లో చాలా చోట్ల సాంకేతిక కారణాలతో ఈవీఎంలు మొరాయించాయి. ఈ కారణంగా అరగంట నుంచి గంటపాటు పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పటిష్ఠ బందోబస్తు చేపట్టారు. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి పోలింగ్ శాతం తగ్గినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.

ఓటేసిన ప్రముఖులు...

ఉమ్మడి జిల్లాలోని ఇద్దరు మంత్రులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్​రెడ్డి వనపర్తి జిల్లాలో, ఎక్సైజ్​ శాఖ మంత్రి శ్రీనివాస్​గౌడ్ మహబూబ్​నగర్​లో ఓటేశారు. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కొల్లాపూర్​లో, మాజీ మంత్రి, మహబూబ్​నగర్ పార్లమెంట్​ అభ్యర్థి డీకే అరుణ గద్వాలలో, నాగర్​కర్నూల్ లోక్​సభ అభ్యర్థి రాములు అచ్చంపేటలో ఓటు వేశారు. మల్కాజిగిరి అభ్యర్థి రేవంత్​రెడ్డి కొండారెడ్డిపల్లిలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలు, రాజకీయ ప్రతినిధులు, ఆయా జిల్లాల కలెక్టర్లు తమ ఓటు హక్కు సద్వినియోగం చేసుకున్నారు.

విషాదం నుంచి తేరుకోని తీలేరు..

నారాయణపేట జిల్లా తీలేరు గ్రామస్థులు ఓటింగ్​కు దూరంగా ఉన్నారు. బుధవారం రోజు 10 మంది కూలీలు మరణించిన ఘటన నుంచి వారు ఇంకా తేరుకోలేదు. సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేయడానికి ఆసక్తి చూపలేదు.

మేము ఎందుకు ఓటేయాలి?

మహబూబ్​నగర్ జిల్లా ఉదండాపూర్​లో జలాశయ నిర్వాసితులు తమను పట్టించుకోలేదని పోలింగ్​కు దూరంగా ఉన్నారు. అదే జిల్లాలోని బూరెడ్డిపల్లి​లో తమ గ్రామాన్ని బాదేపల్లి మున్సిపాలిటీలో కలపడాన్ని నిరసిస్తూ.. ఓటింగ్​ను అడ్డుకున్నారు. ఆమనగల్ మండలంలోని ఆకుతోటపల్లి గ్రామాన్ని పంచాయతీగా గుర్తించనందుకు నిరసనగా ప్రజలు ఎన్నికలను బహిష్కరించారు. వడ్డేపల్లి జక్కిరెడ్డిపల్లి గ్రామంలో ఓట్లు గల్లంతయ్యాయని గ్రామస్థులు ఆందోళన చేపట్టారు. ఓట్ల లెక్క తేలే వరకు పోలింగ్ జరగనివ్వమని అడ్డుకున్నారు.

ఈవీఎంల మొరాయింపు..!

ఉమ్మడి జిల్లాలో పలుచోట్ల ఈవీఎం మొరాయించాయి. గంటల పాటు ఓటర్లు క్యూలో నిలబడాల్సి వచ్చింది. వృద్ధులు, మహిళలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.

ప్రత్యేక ఏర్పాట్లు..

వేసవి దృష్ట్యా అధికారులు ముందస్తుగా జాగ్రత్తలు తీసుకున్నారు. దివ్యాంగులు, వృద్ధులు వారి ఓటు హక్కును సద్వినియోగం చేసుకునేందుకు అధికారులు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు కల్పించారు. ఆటోలు, ఇతర వాహనాల్లో పోలింగ్ కేంద్రాలకు తరలించారు.

పటిష్ఠ బందోబస్తు..

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు, అధికారులు పటిష్ఠ బందోబస్తు చేపట్టారు. సమస్యాత్మక పోలింగ్​ కేంద్రాలను గుర్తించి పకడ్బందీగా ఏర్పాట్లు చేయడం వల్ల ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి.

ఉమ్మడి పాలమూరులో ముగిసిన ఎన్నికలు

ఇవీ చూడండి: కదలింది సినీలోకం... ఓటు వేసింది భవిష్యత్తు కోసం

Intro:TG_SRD_43_22_P2C_VIS_AB_C1
యాంకర్ వాయిస్... లోక్సభ ఎన్నికల సందర్భంగా మెదక్ పార్లమెంట్ స్థానంలో లో కూలింగ్ ఉమ్మడిగా కొనసాగుతుంది లోక్సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా అందులో మెదక్ నియోజకవర్గంలో మాత్రం పోలింగు ఈ రోజు మూడు గంటల వరకు 66 38 శాతం నమోదైంది ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది ఎండను సైతం లెక్కచేయకుండా వృద్ధులు మహిళలు ఉత్సాహంగా ఓట్లు వేశారు మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి కోనాపూర్ తన స్వగ్రామం ఓటు హక్కును వినియోగించుకున్నారు లై లోకసభ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ధర్మారెడ్డి ఇ మాచవరంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు ఎమ్మెల్సీ షేర్ సుభాష్ రెడ్డి ఇ పోచంపల్లి లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు దివ్యాంగులు సైతం పెద్ద ఎత్తున తరలివచ్చారు వీరికి కూడా ఏర్పాటు చేశారు మహిళల కోసం ప్రత్యేకంగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది వేసవి కాలం కావడంతో ఉదయం 7 గంటల నుంచి ఉదయం 11 గంటల వరకు పెద్ద ఎత్తున తరలివచ్చారు కొద్దిగా పెరిగినా మధ్యాహ్నం కాస్త తగ్గింది మెదక్ నియోజకవర్గం పరిధిలో ఆరు మండలాల ఉన్నప్పటికీ ఆరు మండలాల్లో ప్రశాంతంగా పోలింగ్ జరిగింది హౌస్ ల పల్లి గ్రామాన్ని ని మున్సిపాలిటీలో విలీనం చేయడం ద్వారా గ్రామస్తులు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కోల్పోతున్నామని ఓటు వేయమని నిరసన వ్యక్తం చేశారు

Body:ఎన్ శేఖర్

Conclusion:శేఖర్ మెదక్.9000302217
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.