నారాయణపేట జిల్లా కేంద్రంలో 72వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ హరిచందన మువ్వన్నెల పతాకాన్ని ఎగురవేశారు. జిల్లాలో ఇప్పటి వరకు 1460 మంది రైతులు మరణించగా వారి కుటుంబాలకు 5 లక్షల చొప్పున నామినీ ఖాతాలలో జమ చేశామని పేర్కొన్నారు.
కరోనా ప్రభావం కారణంగా ఈ విద్యా సంవత్సరంలో పాఠశాలలు మూతపడినా.. దూరదర్శన్, టి షాట్ ద్వారా విద్యార్థులందరూ డిజిటల్ తరగతులు వీక్షించే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించిందని కలెక్టర్ హరిచందన వివరించారు. రాష్ట్ర విద్యా శాఖ ఆదేశాల మేరకు ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి పాఠశాలలు ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. నారాయణ పేట జిల్లా వ్యాప్తంగా 2020-21 సంవత్సరానికి గాను కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాల ద్వారా 2,707 లబ్ధిదారులకు రూ. 26.68 కోట్లు అందించామని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: తమ్ముడిని చంపిన అన్న.. భూ వివాదాలే కారణమా?