నారాయణపేట జిల్లాలో మంగళవారం కలెక్టర్ హరిచందన పర్యటించారు. బాల భవన్ నిర్మాణం కోసం పలు స్థలాలను పరిశీలించారు. ఆమె వెంట ఆర్డీవో శ్రీనివాస్, డీఆర్డీవో ఓ కాళిందిని, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ ఇతర అధికారులు ఉన్నారు.
ఉపకార వేతనాలు చెల్లించండి
అనంతరం జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఇంటర్, డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాళ్లతో కలెక్టరేట్లో సమావేశమయ్యారు. 2017 నుంచి 2020 విద్యాసంవత్సరం వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన విద్యార్థులకు చెల్లించాల్సిన ఉపకార వేతనాలను ఈ నెల 19లోగా చెల్లించాలని సూచించారు. సమావేశంలో రియాజ్ హుస్సేన్, ట్రైబల్ వెల్ఫేర్ అధికారి శ్రీనివాస్ ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఉట్కూరులో అదనపు కలెక్టర్ పర్యటన
జిల్లాలోని ఊట్కూరు మండలంలో అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి పర్యటించారు. పులిమామిడి, బిజ్వార్, ఊట్కూరు గ్రామాల్లో రైతు వేదిక స్థలాలను, నిర్మాణ పనులను పరిశీలించారు. పనులు వేగంగా చేయాలని స్థానిక అధికారులకు సూచించారు.
ఇదీ చూడండి: గోదావరి -కావేరి అనుసంధానంపై రాష్ట్రాలతో 18న కేంద్రం చర్చ