ETV Bharat / state

రైతులకు ఇబ్బంది లేకుండా పత్తి కొనుగోలు చేస్తాం: ఎమ్మెల్యే - పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభం వార్తలు ఊట్కూరు

నారాయణ పేట జిల్లా ఊట్కూరులో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే రాజేందర్​ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మక్తల్​ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్​ రెడ్డి పాల్గొన్నారు. గతంతో పోలిస్తే పత్తి దిగుబడి పెరిగే అవకాశం ఉందని.. అందుకనుగుణంగా తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.

రైతులకు ఇబ్బంది లేకుండా పత్తి కొనుగోలు చేస్తాం: ఎమ్మెల్యే

author img

By

Published : Nov 2, 2020, 5:25 PM IST

నారాయణ పేట జిల్లా ఊట్కూరు మండల కేంద్రంలో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని నారాయణపేట శాసనసభ్యుడు రాజేందర్ రెడ్డితో కలిసి మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్​ రెడ్డి ప్రారంభించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పత్తి కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు.

గతంతో పోలిస్తే పత్తి దిగుబడి పెరిగే అవకాశం ఉందని.. అందుకు అనుగుణంగా తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మక్తల్ మార్కెట్ యార్డ్ ఛైర్మన్ రాజేశ్ గౌడ్, జడ్పీటీసీ అశోక్ గౌడ్, ఊట్కూరు సర్పంచ్ సూర్య ప్రకాశ్ రెడ్డి, ఏవో గణేశ్​ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: 90 శాతం పత్తిని సీసీఐ ద్వారా కొనుగోలు చేయాలి: ఈటల

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.