ETV Bharat / state

నీటిని విడుదల చేసిన ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్​ రెడ్డి - తెలంగాణ వార్తలు

జూన్​లోనే సంగంబండ డ్యామ్​కు నీళ్లు రావడంపై నారాయణపేట జిల్లా మక్తల్​ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్​ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. భీమా ఫేజ్ వన్ లిఫ్ట్ టూ నుంచి సాగునీటిని విడుదల చేశారు.

నీటిని విడుదల చేసిన ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్​ రెడ్డి

author img

By

Published : Jun 11, 2021, 10:07 AM IST

నారాయణపేట జిల్లా సంగంబండ డ్యామ్​కు నీళ్లు రావటంపై ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్​ రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. జూన్ నెల ప్రారంభంలోనే భీమా లిప్టులు ప్రారంభించుకోవడం చరిత్రలో ఇదే తొలిసారని అన్నారు. గురువారం ఖానాపూర్ రోడ్​లోని భీమా ఫేజ్ వన్ లిఫ్ట్ టూ నుంచి నీటిని డ్యామ్​కు విడుదల చేశారు.

ఈసారి కూడా పుష్కలంగా వర్షాలు కురిసి, రైతన్నలకు పంటలు బాగా పండాలని ఆకాంక్షించారు. అక్కడే మియావాకి విధానంలో పెంచుతున్న ఆయుర్వేద నర్సరీని పరిశీలించారు. యాదాద్రి తరహాలో చిట్టడవిని ఎకరం పరిధిలో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం మాగనూర్​లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రసూతి విభాగాన్ని ప్రారంభించారు. లబ్ధిదారుకు కేసీఆర్​ కిట్​ అందించారు.

ఇదీ చదవండి: విద్యార్థులకు గుడ్​న్యూస్: స్టూడెంట్​ వీసాల ప్రక్రియ ప్రారంభం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.