నారాయణ పేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ఆరో విడత హరితహారం కార్యక్రమాన్నికి శ్రీకారం చుట్టారు. పట్టణ కేంద్రంలోని ఐదో వార్డులో రహదారికి ఇరువైపుల మొక్కలు నాటారు. మొక్కలు నాటి సంరక్షించే కార్యక్రమాన్ని ఇకనుంచి నిరంతరాయంగా కొనసాగించాలన్నారు. హరితహారంలో భాగంగా నాటిన ప్రతి మొక్కను కాపాడాలని సూచించారు.
కరోనా నేపథ్యంలో కొవిడ్-19 నిబంధనలకు లోబడి హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశించారు. భౌతిక దూరం పాటించి మాస్కులు విధిగా ధరించేలా చూడాలని తెలిపారు. ఆరో విడత హరితహారం విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో అటవీ శాఖ అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.