ETV Bharat / state

KTR: నేడు నారాయణపేట జిల్లాలో మంత్రి కేటీఆర్​ పర్యటన

నేడు నారాయణపేట జిల్లాలో పర్యటించనున్న మంత్రి కేటీఆర్​.. ప్రభుత్వ ఆస్పత్రిలో చిల్లపిల్లల వార్డును ప్రారంభిస్తారు. అనంతరం వెజ్​, నాన్​వెజ్​ మార్కెట్​కు శంకుస్థాపన చేస్తారు.

ktr narayanpet tour
ktr narayanpet tour
author img

By

Published : Jul 10, 2021, 5:45 AM IST

నారాయణపేట జిల్లాలో మంత్రి కేటీఆర్​ పర్యటించనున్నారు. జిల్లా కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. నారాయణపేట ప్రభుత్వ ఆస్పత్రిలో 10 ఐసీయూ పడకలు, 3 వెంటిలేటర్లతో కూడిన పిల్లల వార్డును కేటీఆర్​ ప్రారంభిస్తారు. రూ.6 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించే వెజ్, నాన్​వెజ్​ మార్కెట్​కు శంకుస్థాపన చేస్తారు.

రూ.20 లక్షలతో నిర్మించే అమరవీరుల స్మారక ఉద్యానవనం, సింగారం క్రాస్​రోడ్డులో చేనేత శిక్షణ, ఉత్పత్తి కేంద్రం, అంబేడ్కర్​ చౌరస్తా సుందరీకరణ పనులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. పిల్లల, సైన్స్ పార్కును ప్రారంభిస్తారు. సైన్స్ పార్క్ సమీపంలో ఏర్పాటు చేసిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొంటారు.

హెలికాప్టర్​లో హైదరాబాద్ నుంచి నారాయణపేటకు రానున్న కేటీఆర్​.. షెడ్యూల్​ పూర్తయ్యాక తిరిగి హెలికాప్టర్​లోనే హైదరాబాద్​కు చేరుకుంటారు. మంత్రి పర్యటకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు అధికారులు తెలిపారు.

ఇదీచూడండి: KISHAN REDDY: 'పర్యాటక రంగానికి కొత్త ఉత్తేజం తీసుకువస్తా'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.