నారాయణ పేట జిల్లా మక్తల్ పట్టణ శివారులోని ఇటుకబట్టీల వద్ద కార్మికులకు ఒక్కొక్కరికీ 12కిలోల బియ్యం, రూ.500నగదు ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి అందించారు. లాక్‌డౌన్ నేపథ్యంలో ఆకలిచావులు ఉండరాదనే ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సాయం అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. కనీసం మీటరు దూరం పాటించాలని, ముఖానికి మాస్కులు తప్పనిసరి ఉపయోగించాలని సూచించారు. ప్రతిఒక్కరూ జాగ్రత్తలు పాటించి, కరోనా మహమ్మారిని తరిమికొట్టాలని కోరారు.
ఇవీచూడండి: తెలంగాణలో ఆరుకు చేరిన కరోనా మృతుల సంఖ్య