దేశంలో ఎక్కడాలేని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి తెలిపారు. జిల్లాకేంద్రంలోని ఆర్డీవో కార్యాలయంలో 133 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.
అధికారంలోకి వచ్చిరాగానే అభివృద్ధి పథకాలకు సీఎం నాంది పలికారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఛైర్మన్ వనజమ్మ, ఎంపీపీ శ్రీనివాస్‌రెడ్డి, పురపాలక ఛైర్మన్ అనసూయ, జడ్పీటీసీ అంజలి, పీఎసీఎస్ ఛైర్మన్ నర్సింహారెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.