తెలంగాణ ఏర్పడింది కేవలం కేసీఆర్ వల్లేనని తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి వాణీదేవి అన్నారు. ఓటర్లలో 40 శాతం మహిళలున్నారంటూ.. కేవలం వారు ఓటేసినా కచ్చితంగా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణ కేంద్రంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్‌తో కలిసి ఆమె పాల్గొన్నారు.
తెరాస ప్రభుత్వం ఇచ్చిన పెన్షన్లకు.. గత ప్రభుత్వాలు 30 ఏళ్లుగా ఇచ్చిన పెన్షన్ల నిధులు ఏమాత్రం సరిపోవని మంత్రి శ్రీనివాస్ గౌడ్ గుర్తు చేశారు. భాజపా అభ్యర్థి గెలిస్తే.. పనులవుతాయో కావో ఓటర్లే ఆలోచించుకోవాలని సూచించారు. ఇప్పటివరకూ లక్షా 30 వేల ఉద్యోగాలు ఇచ్చామన్న మంత్రి.. త్వరలో మరో 55 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేసే అవకాశాలున్నాయని వివరించారు.
ఈ కార్యక్రమంలో మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి, జడ్పీ ఛైర్పర్సన్ వనజ, డీసీసీబీ ఛైర్మన్ నిజాం పాషా, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: జైలు జీవితం గడపక తప్పదు: బండి సంజయ్