ETV Bharat / state

మలమూత్ర నిషేధిత గ్రామంగా సిపూర్​

నారాయణపేట జిల్లా సీపూర్​ను బహిరంగ మలమూత్ర విసర్జన నిషేధిత గ్రామంగా కలెక్టర్​ వెంకట్రావ్​ ప్రకటించారు. ఈ నెలాఖరున ఓడీఎఫ్​గా ప్రకటించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

మలమూత్ర నిషేధిత గ్రామంగా సిపూర్​
author img

By

Published : Jul 20, 2019, 4:05 PM IST

ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి నిర్మించుకుంటేనే గుణాత్మక అభివృద్ధి చెందినట్లని నారాయణపేట కలెక్టర్​ వెంకట్రావ్​ అన్నారు. నర్వ మండలం సీపూర్​ గ్రామాన్ని బహిరంగ మలమూత్ర విసర్జన నిషేధిత గ్రామంగా ప్రకటించారు. ములుగు జిల్లా పాలనాధికారి నారాయణరెడ్డి స్వగ్రామమైన సీపూర్​ను కలెక్టర్​ వెంకట్రావ్​ దత్తత తీసుకొని రెండు నెలల్లోనే ఎంతో అభివృద్ధి చేసినట్లు తెలిపారు. ఊరిలో వందశాతం మరుగుదొడ్లు ఉంటే 70శాతం రోగాలు దూరమైనట్లేనని ఆయన అన్నారు. గ్రామాభివృద్ధికి పూర్తి సహకారం అందించనున్నట్లు కలెక్టర్​ హామీ ఇచ్చారు. ఈ నెలఖరున ఓడీఎఫ్​ గ్రామంగా ప్రకటించనున్నట్లు తెలిపారు.

మలమూత్ర నిషేధిత గ్రామంగా సిపూర్​

ఇదీ చూడండి: పాడె మోసిన ఎమ్మెల్యే శంకర్​ నాయక్​

Intro:TG_mbnr_18_19_ODF_ga_prakatinchina_collecter_avb_TS10092
శ్రీపూర్ గ్రామాన్ని బహిరంగ మలమూత్ర విసర్జన నిషేధిత గ్రామంగా ప్రకటించిన నారాయణపేట జిల్లా కలెక్టర్ వెంకట్రావు.
ముఖ్యఅతిథిగా హాజరైన ములుగు జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి.

Body:నారాయణపేట జిల్లా నర్వ మండలం లోని శ్రీపురం గ్రామాన్ని బహిరంగ మలమూత్ర విసర్జన నిషేధిత గ్రామంగా జిల్లా కలెక్టర్ వెంకట్రావు ప్రకటించారు ముఖ్యఅతిథిగా ములుగు జిల్లా కలెక్టర్ ర్ నారాయణ రెడ్డి ఇ హాజరయ్యారు. ములుగు జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి స్వస్థలం అయినటువంటి శ్రీపూర్ లో పుట్టి పెరిగిన ఊరుని నారాయణపేట జిల్లా కలెక్టర్ వెంకట్రావు దత్తత తీసుకొని రెండు నెలల్లోనే ఎంతో అభివృద్ధి చేశారని జీవితంలో ఈరోజు మరచిపోలేని రోజుగా నిలుస్తుందన్నారు. గ్రామాల్లో సిమెంటు రోడ్లు వేస్తే అభివృద్ధి కాదని ప్రతి ఇంటికి మరుగుదొడ్డి ఉంటేనే గుణాత్మకంగా అభివృద్ధి చెందినట్లు అన్నారు. మరుగుదొడ్డి ఉన్నట్లయితే 70 శాతం రోగాలు దూరం అవుతాయని అన్నారు. వీటితోపాటు భూత్పూర్ రిజర్వాయర్ కాలువ పరిధిలో ఫీడర్ ఛానల్ ను ఏర్పాటు చేసి రైతు పొలాలకు నీరందించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.శ్రీపూర్ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతున్న పేట కలెక్టర్ కు మా గ్రామస్తులు రుణపడి ఉంటారని అందరి తరపున తాను ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం నారాయణపేట జిల్లా కలెక్టర్ వెంకట్రావు మాట్లాడుతూ గ్రామంలో మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు రూపాయలు 50 లక్షలు బ్యాంకు రుణం ఇప్పిస్తానని వీటితో కంది మిల్లును తయారుచేసి ఎగుమతిని చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నారు.కొత్తగా ఏర్పాటయిన జిల్లాలో మూడు నెలల వ్యవధిలోనే 25742 మరుగుదొడ్లు నిర్మించామని ఈనెలాఖరున జిల్లా మొత్తం ఓడిఎఫ్ గా ప్రకటించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు. ఈ కృషిని జిల్లా, మండల, గ్రామస్థాయి అధికారులు సహకరించడం వల్లే సాధ్యపడుతుందన్నారు. నర్వ మండలం జలశక్తి అభియాన్ పథకం రావడం ఈ ప్రాంత ప్రజలు చేసుకున్న అదృష్టమని జల వనరులను ఒడిసిపట్టుకుని అందుకు అవసరమైన పనులన్నీ చేసుకుందామన్నారు. అనంతరం ములుగు,నారాయణపేట జిల్లాల కలెక్టర్లు సిపురంను ఓడిఎఫ్ గా ప్రకటించి అట్టి ధ్రువపత్రాన్ని సర్పంచి లక్ష్మీదేవమ్మ కు అందజేశారు.

Conclusion:ఈ కార్యక్రమంలో లో ఎంపిటిసి సుధాకర్ రెడ్డి ,ఉపసర్పంచి శ్రీనివాస్ గౌడ్, డిపిఓ మురళి, జిల్లా విద్యాధికారి రవీందర్, తాసిల్దార్ శ్రీనివాస్ ఎంపిడిఓ రమేష్ కుమార్ జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు.

రవీంద్రారెడ్డి ,మక్థల్,9959999069.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.