ETV Bharat / state

లాక్​డౌన్​ వేళ.. ఒక్కటైన జంటలు - four Couples married during lock down time

జీవితంలో ఒకేసారి జరుపుకునే పెళ్లి ఘనంగా జరుపుకోవాలని ఎవరికైనా ఆశ ఉంటుంది. కాని కరోనా వ్యాప్తి దృష్ట్యా విధించిన లాక్‌డౌన్‌ ప్రభావం పెళ్లిళ్ల మీద పడింది. ఈ నెల 14 వరకే లాక్‌డౌన్‌ కొనసాగుతుందని భావించి కొందరు ఏప్రిల్‌ 16న ముహూర్తాలు పెట్టుకున్నారు. లాక్‌డౌన్‌ పొడగించడం వల్ల చేసేదేమీలేక అనుకున్న సమయానికి కొద్దిమంది ఆత్మీయుల మధ్య నిరాడంబరంగా వివాహాలు చేసుకున్నారు. నారాయణపేట జిల్లా బైరంకొండలో నాలుగు పెళ్లిళ్లు జరిగాయి.

marriage
marriage
author img

By

Published : Apr 17, 2020, 5:05 AM IST

Updated : Apr 17, 2020, 9:53 AM IST

లాక్​డౌన్​ వేళ.. ఒక్కటైన జంటలు

పెళ్లంటే జీవితంలో మరచిపోలేని జ్ఞాపకం. మధురమైన ఘట్టం. అందుకే వివాహా వేడుకల్ని కుల, మత, ధనిక, పేద తారతమ్యం లేకుండా ఉన్నంతలో ఘనంగా చేసుకుంటారు. ఇంటి ముందు పందిళ్లు, ఇల్లంతా చుట్టాలు, బాజాలు, భజంత్రీలు, విందులు, వినోదాలు ఇలా వివాహ క్రతువులో ఎన్నో ఘట్టాలు.

ప్రస్తుతం వివాహలపై కరోనా ప్రభావం పడింది. ఈ నెల 14 వరకే లాక్ డౌన్ కొనసాగుతుందని భావించి.. ఏప్రిల్ 16న పెళ్లికి ముహుర్తాలు పెట్టుకున్నాయి ఆ కుటుంబాలు. లాక్​డౌన్​ను పొడిగించడం వల్ల చేసేది లేక.. పెట్టుకున్న ముహుర్తానికే నిరాడంబరంగా వివాహాలు జరిపించాయి. నారాయణపేట జిల్లాలోని బైరంకొండ గ్రామంలో నాలుగు జంటలు పెళ్లి చేసుకుని ఏకమయ్యాయి. వరుల ఇళ్లల్లో పెళ్లిళ్లు జరగ్గా.. వధువుల్లో ఒకరిది కర్ణాటక రాష్ట్రం మద్వార్ కాగా మరొకరిది పస్పుల. ఇంకొకరిది ఉట్కూరు మండల కేంద్రం కాగా.. మరొకరిది ఊట్కూరు మండలం పగిడిమర్రి.

పెళ్లి ఎలా జరిపించారంటే..

వధువుల్ని వారి బంధువులు ఉదయం ఏడింటికే ఆయా ప్రాంతాల నుంచి ద్విచక్ర వాహనంపై తీసుకురాగా... వధూవరుల తల్లిదండ్రులు, సన్నిహితుల నడుమ వారి వివాహాలు జరిగాయి. ఎవరి ఇళ్ల ముందు వాళ్లు చిన్న పందిళ్లు వేసుకుని వివాహ క్రతువును మమ అనిపించారు. ఎంతో ఘనంగా నిర్వహించుకోవాల్సిన పెళ్లినిరాడంబరంగా జరిగినందుకు కాస్త ఇబ్బంది పడ్డా.. అనుకున్న ముహుర్తానికి పూర్తి కావడం వారి కుటుంబాల్లో సంతోషాన్ని నింపింది.

ఇదీ చూడండి : సడలింపులపై రాష్ట్ర ప్రభుత్వం విముఖత!

Last Updated : Apr 17, 2020, 9:53 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.