నారాయణపేట జిల్లా మక్తల్ మండలం కర్నె ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విషాదం చోటుచేసుకుంది. ఇవాళ ఉదయం పాఠశాలలో విద్యార్థులకు పెట్టిన అల్పహారం వికటించి... అస్వస్థతకు గురయ్యారు. ఉప్మా తిన్న గంట తర్వాత విద్యార్థులు వాంతులు చేసుకున్నారు. అప్రమత్తమైన సిబ్బంది ఆసుపత్రికి తరలించి... వైద్యం అందించారు.
విషయం తెలుసుకున్న నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి... ఆసుపత్రికి వచ్చి విద్యార్థులను పరామర్శించారు. చిన్నారులకు అందిస్తున్న వైద్యసేవలపై ఆరా తీశారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. కోలుకున్న విద్యార్థులను తల్లిదండ్రులు ఇంటికి తీసుకెళ్లారు.
ఇదీ చూడండి: మేడారం వచ్చిన భక్తులకు సకల సౌకర్యాలు కల్పించాలి: సీఎం కేసీఆర్