నారాయణపేట జిల్లా కేంద్రంలోని మున్సిపల్ పార్క్ ఎదుట ఫీల్డ్ అసిస్టెంట్లు ధర్నా చేశారు. జాతీయ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించాలని తీసుకువచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలని రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు.
గ్రామీణ ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో ఉండే కార్యదర్శులకు జీతం పెంచాలని కోరారు. అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి కలెక్ట్ వెంకట్రావుకు వినతిపత్రాన్ని అందించారు. వారిని తొలగించకుండా ప్రభుత్వం నివేదిక పంపించాలని కలెక్టర్ను కోరారు.
ఇవీ చూడండి: "వారిని కూడా చేరిస్తే 'ఎన్ఆర్సీ, ఎన్పీఆర్'కు మద్దతిస్తాం!"