నారాయణపేట జిల్లా ధన్వాడ మండల కేంద్రంలో తండ్రికొడుకులు కొవిడ్‌తో మూడు రోజుల వ్యవధిలోనే మృతి చెందారు. సుంకు రాజయ్య కుటుంబ సభ్యుల్లో పలువురు కరోనా బారిన పడ్డారు. రాజయ్య ఆయన చిన్న కొడుకు చందు, కోడలు, మనవరాలుకు కొవిడ్ పాజిటివ్ రాగా ఇబ్బందులు పడుతున్నారు. కుటుంబ సభ్యులు అందరూ హోమ్ క్వారంటైన్‌లోనే ఉండగా కొడుకు చందు పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో అంబులెన్స్‌లో నారాయణపేట ఆస్పత్రికి అటు నుంచి మహబూబ్‌నగర్ ఆస్పత్రికి తరలించారు.
చికిత్స నిర్వహిస్తుండగా ఈనెల 7న పరిస్థితి విషమించి మృతి చెందాడు. ఆ తర్వాత కరోనా నుంచి కుదుటపడ్డట్టు కనిపించిన రాజయ్య ఆదివారం మళ్లీ అస్వస్థతకు గురయ్యారు. వెంటనే నారాయణపేట ఆస్పత్రికి అటు నుంచి మహబూబ్‌నగర్ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం నుంచి అంబులెన్స్ నుంచి దించుతుండగానే ప్రాణాలు వదిలారు.