నారాయణపేట జిల్లా మరికల్ పట్టణంలో విజయదశమి మహోత్సవాలు ఘనంగా జరిగాయి. కాషాయ ధ్వజం నీడలో పట్టణంలోని ప్రజాప్రతినిధులు, ప్రముఖులు, యువకులు, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్, హిందు విశ్వ పరిషత్, బజరంగ్ దళ్, ఏబీవీపీ, యువక మండలి తదితర ఉత్సవ నిర్వాహకుల సమక్షంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్థానిక రామాలయంలో ధ్వజారోహణం చేపట్టి.. జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజలు చేశారు.
గ్రామ పంచాయతీ ఆవరణలో ఏర్పాటు చేసిన రావణాసుర వధ కార్యక్రమాన్ని సర్పంచ్ గోవర్ధన్ రామబాణం సంధించి ప్రారంభించారు. ఆలింగనం వద్దు నమస్కారం ముద్దు అంటూ.. జైశ్రీరామ్ చెబుతూ విజయదశమి శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
ఇదీ చూడండి: విజయదశమి సందర్భంగా మంత్రి గంగుల ప్రత్యేక పూజలు