నారాయణపేట జిల్లా తిరుమలాపూర్ గ్రామానికి చెందిన కోస్గి కృష్ణ తనకున్న పొలంలో కీరదోస సాగు చేశాడు. పంట చేతికొచ్చే సమయంలోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటించడం వల్ల పంటను అమ్ముకోలేని పరిస్థితి ఏర్పడింది. ఏం చేయాలో పాలుపోక... పంటను అమ్ముకోలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాడు.
అధికారుల చుట్టూ తిరిగితే... పంటను అమ్ముకోవచ్చని తెలిపారు. కానీ సరైన డిమాండ్ లేనందున పంట మొత్తం నేలపాలైంది. దాదాపు 2 లక్షల వరకూ నష్టం వాటిల్లిందని రైతు వాపోతున్నాడు.
ఇవీ చూడండి: గవర్నర్ తమిళిసైతో భాజపా ప్రతినిధుల బృందం భేటీ