ETV Bharat / state

ట్రైబ్యునల్​లో ఫిర్యాదు చేసుకోవచ్చు: కలెక్టర్​ - నారాయణపేట జిల్లా తాజా వార్తలు

రైతులు తమ భూ సమస్యల పరిష్కారానికి ట్రైబ్యునల్​లో ఫిర్యాదు చేసుకోవచ్చని నారాయణపేట జిల్లా కలెక్టర్​ హరిచందన తెలిపారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్, రెవెన్యూ అధికారులు, మీ సేవ కేంద్రాల సిబ్బందితో ప్రత్యేక ట్రైబ్యునల్​పై సమీక్ష నిర్వహించారు.

collector review meeting on tribunal in narayanapeta
ట్రైబ్యునల్​లో ఫిర్యాదు చేసుకోవచ్చు: కలెక్టర్​
author img

By

Published : Jan 19, 2021, 11:20 AM IST

నారాయణపేట కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్, రెవెన్యూ అధికారులు, మీ సేవ కేంద్రాల సిబ్బందితో కలెక్టర్​ హరిచందన సమీక్ష నిర్వహించారు. ప్రత్యేక ట్రైబ్యునల్​పై చర్చించారు. ఇప్పటి వరకు జిల్లాలో 337 ధరణి కేసులు ఉన్నాయని.. వీటిని పరిష్కరించేందుకు ధరణి ప్రత్యేక ట్రైబ్యునల్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

రైతులకు వారి కేసుకు సంబంధించిన సమాచారం ఇచ్చి.. ఏ తేదీన ఎప్పుడు కలెక్టరేట్​కు రావాలో ముందస్తుగానే సమాచారం ఇస్తామన్నారు. సాదా బైనామా కేసులను చాలా జాగ్రత్తగా పరిశీలించి పరిష్కరించాల్సి ఉంటుందని రెవెన్యూ అధికారులను సూచించారు. రైతులు రైతు వేదికలు, పల్లెప్రకృతి వనాలకు ఇచ్చిన భూమి, రోడ్డు విస్తరణలో పోయిన భూమిని వారి పట్టాదారు పాస్ బుక్​ల నుంచి మినహాయించాలన్నారు. ఇప్పటి వరకు పట్టాదారు పాస్ బుక్​లో ఆధార్ నమోదు కాని వాటిని గుర్తించి అప్డేట్ చేయాలని ఆదేశించారు.

ఇదీ చదవండి: తెలంగాణలో మరో 256 కరోనా కేసులు, 2 మరణాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.