ETV Bharat / state

ఇటుకబట్టీల్లో మగ్గుతున్న బాల్యం.. విద్యావకాశాలకు దూరంగా చిన్నారులు - telangana latest news

ఇటుకల తయారీకి కార్మికుల కుటుంబాలను వలస తీసుకువస్తున్న బట్టీల యజమానులు.. వారి సంక్షేమం విస్మరిస్తున్నారు. కనీస వసతులు కల్పించకపోవడంతో వారి పిల్లల బాల్యం బట్టీల్లో బుగ్గిపాలవుతోంది. పలకా బలపం పట్టాల్సిన చిన్నారులు.. కూలీ పనులు చేస్తూ చదువుకు దూరమవుతున్నారు. నారాయణపేట జిల్లాలో పలు ఇటుక బట్టీలను ఈటీవీ-ఈటీవీ భారత్​ బృందం క్షేత్రస్థాయి పరిశీలన చేయగా.. కార్మికులు-పిల్లల విషయంలో నిబంధనలకు తూట్లు పొడుస్తున్న వైనం వెలుగు చూసింది.

ఇటుకబట్టీల్లో మగ్గుతున్న బాల్యం.. విద్యావకాశాలకు దూరంగా చిన్నారులు

author img

By

Published : Feb 17, 2022, 5:11 AM IST

Updated : Feb 17, 2022, 6:44 AM IST

నారాయణపేట జిల్లాలోని మక్తల్, మరికల్, మాగనూరు, కృష్ణా, నర్వ, నారాయణపేట, ధన్వాడ, కోస్గి, దామరగిద్ద, మద్దూరు మండలాల్లో 100కు పైగా ఇటుక బట్టీలున్నాయి. అక్కడ పని చేసేందుకు ఒడిశా, మహారాష్ట్ర, కర్ణాటక సహా జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి లాంటి ప్రాంతాల నుంచి కార్మికులు 6 నుంచి 8 నెలల పాటు వలస వస్తారు. బట్టీ సామర్థ్యం మేరకు ఒక్కో బట్టీలో 20 నుంచి 200 మంది వరకు కార్మికులు పని చేస్తుంటారు. నారాయణపేట జిల్లా వ్యాప్తంగా ఇతర రాష్ట్రాల నుంచి సుమారు 3 వేల మంది కార్మికులు వచ్చి పని చేస్తున్నారు. ఉమ్మడి మహబూబ్​నగర్​ జిల్లాలో 400 నుంచి 500 ఇటుక బట్టీలు నడుస్తుండగా.. 6 నుంచి 8 వేల మంది కార్మికులు పని చేస్తారు. వారికి కనీస వసతులు కల్పించడంతో పాటు కార్మికుల చిన్నారులకు చదువు చెప్పించాల్సిన బాధ్యత.. బట్టీ యజమానులదేనైనా.. ఎక్కడా అమలు కావడం లేదు.

ఇటుకబట్టీల్లో మగ్గుతున్న బాల్యం.. విద్యావకాశాలకు దూరంగా చిన్నారులు

బడి బోర్డులున్నా.. పాఠాలు మాత్రం సున్నా..

కార్మికుల బడి ఈడు పిల్లల్ని దగ్గరలోని పాఠశాలల్లో చేర్పించి చదువు చెప్పించాలి. ఇతర రాష్ట్రాలకి చెందిన వారైతే అక్కడి భాషను నేర్పే ఉపాధ్యాయుడిని నియమించాలి. చదువు కోసం ప్రత్యేకంగా గదులు కేటాయించాలి. పేరుకు బడి ఏర్పాటు చేసినట్లు బోర్డులున్నా.. పాఠాలు మాత్రం సాగడం లేదు. మరికల్, మక్తల్ మండలంలోని కొన్ని బట్టీల్లోని బడుల్లో చిన్నారులు కనిపించలేదు. హాజరు నమోదు పట్టికను సైతం నిర్వహించట్లేదు. చదువు నేర్చుకోవాల్సిన పిల్లలు ఇటుక తయారీ పనులు చేస్తూ కనిపించారు. ఆరేళ్లలోపు పిల్లలను అంగన్​వాడీ కేంద్రాల్లో చేర్పించి.. పౌష్టికాహారం అందేలా చర్యలు చేపట్టాల్సి ఉన్నా.. బట్టి యజమానులు, సంబంధిత అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదు.

స్నానాల గదులు, మరుగుదొడ్లు ఎక్కడ..?

కార్మికులకు కనీస వసతుల కల్పనలో బట్టీ యజమానులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. తాత్కాలికంగా నిర్మించిన రేకుల గదుల్లోనే కాలం వెళ్లదీస్తున్నారు. నిబంధనల ప్రకారం స్నానాల గదులు, మరుగుదొడ్లు ఏర్పాటు చేయాల్సి ఉన్నా.. ఎక్కడా అవి నిర్మించలేదు. చిన్నారులను చదివించేలా ప్రభుత్వం బట్టీల యజమానులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

కఠిన చర్యలు తప్పవు..

ఈ విషయాన్ని జిల్లా కార్మికశాఖ సహాయ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లగా.. ఇటుక బట్టీల్లో పనిచేసే కార్మికుల పిల్లలు చదువుకు దూరం కాకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత యజమానులదేనని తెలిపారు. చిన్నారులను కార్మికులుగా వినియోగిస్తే చట్టపరంగా చర్యలు తప్పవని హెచ్చరించారు. అధికారులతో విచారణ చేసి నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఇదీ చూడండి: Sabitha Indra Reddy : 'పోటీ పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేయండి'

Last Updated : Feb 17, 2022, 6:44 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.