ETV Bharat / state

మక్తల్​ను గెలిచి మోదీకి కానుక ఇద్దాం: లక్ష్మణ్​

మక్తల్​ మున్సిపాలిటీని గెలిచి ప్రధాని మోదీకి బహుమతిగా ఇద్దామన్నారు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్​. నారాయణపేట జిల్లా మక్తల్​ మున్సిపల్​ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

bjp state president laxman municipal Elections campaign
మక్తల్​ను గెలిచి మోదీకి కానుక ఇద్దాం: లక్ష్మణ్​
author img

By

Published : Jan 17, 2020, 10:09 PM IST

నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో రాష్ట్ర భాజపా అధ్యక్షుడు కె.లక్ష్మణ్​ పాల్గొన్నారు. తెరాసలో భూ మాఫియా, ఇసుక మాఫియా అభ్యర్థులు ఉన్నారని ఆరోపించారు. ప్రజలకు సేవ చేసే నిజమైన కార్యకర్తలే భాజపా తరఫున బరిలో ఉన్నారని తెలిపారు.

మక్తల్​ మున్సిపాలిటీని గెలిచి ప్రధాని మోదీకి బహుమతిగా ఇద్దామన్నారు. కేంద్రం అమలు చేసిన అమృత్, స్మార్ట్ సిటీ పథకాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం... పట్టణాలను అభివృద్ధి చేసిందని చెప్పారు.

మక్తల్​ను గెలిచి మోదీకి కానుక ఇద్దాం: లక్ష్మణ్​

ఇవీ చూడండి;నిర్భయ దోషి క్షమాభిక్షకు నిరాకరించిన రాష్ట్రపతి

Intro:Tg_mbnr_18_17_BJP_Laxman_Makthal_tour_av_TS10092
మక్తల్ మున్సిపల్ చైర్మన్ పదవిని నరేంద్ర మోడీకి కానుకగా ఇద్దాం.
మక్తల్ తెరాస గెలిస్తే మరో బైంసా గా మారుతుంది అని తెలిపిన భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్.

Body:నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణ కేంద్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ పర్యటించారు. తెరాస పార్టీలో భూ మాఫియా,ఇసుక మాఫియా అలాంటి అభ్యర్థులు ఉన్నారని అలాంటి అభ్యర్థులు భారతీయ జనతా పార్టీలో లేరని ప్రజల సేవ కొరకై పనిచేసే నిజమైన కార్యకర్తలే భాజపా తరఫున బరిలో ఉన్నారని , ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేని అధికారపార్టీకి ప్రచారం చేసే హక్కు లేదని మండిపడ్డారు. కేంద్రం అమలు చేసిన కేంద్ర అమృత్ ,స్మార్ట్ సిటీ పథకాల ద్వారా పట్టణాలను అభివృద్ధి చేసిందని. రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులే ఇవ్వలేదని ఆయన అన్నారు. ఇండ్ల కోసం కేంద్రం ఇస్తున్న నిధులను అధికార పార్టీ మళ్ళీస్తున్నారని ఆరోపించారు.మక్తల్ మున్సిపల్ ఎన్నికల్లో భాజపా అధిక మెజార్టీతో గెలిపించి మక్తల్ మున్సిపల్ చైర్మన్ పదవిని నరేంద్రమోడీ కి కానుకగా ఇవ్వాలని తెలిపారు.

Conclusion:ఈ కార్యక్రమంలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, మాజీ పార్లమెంటు సభ్యుడు జితేందర్ రెడ్డి, మాజీ మంత్రి డీకే అరుణ, కొండయ్య ,జలేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.