రాష్ట్ర భాజపా ఆదేశాల మేరకు నారాయణపేట జిల్లా కేంద్రంలో వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం ముందు ఆ పార్టీ నేతలు ధర్నా చేపట్టారు. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్న తరుణంలో ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందన్నారు.
జిల్లాకు ఇప్పటికే ముంబయి నుంచి 16,000 లకు పైగా వలస కార్మికులు తమ స్వస్థలాలకు వచ్చారని పేర్కొన్నారు. వారందరికీ ఎలాంటి కరోనా పరీక్షలు చేయలేదని విమర్శించారు. కేంద్రం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని భాజపా నాయకులు కోరారు.