నారాయణపేట జిల్లా ఉట్కూరు పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ పత్తి విత్తనాలు కలకలం సృష్టించాయి. తిప్రస్ పల్లి గ్రామానికి చెందిన శ్రీనివాసు ముదిరాజ్ ఇంట్లో నకిలీ పత్తి విత్తనాలు అమ్ముతున్నట్లు సమాచారం అందింది.
వెంటనే రెండు బృందాలుగా విడిపోయిన పోలీసులు దాడులు నిర్వహించారు. దాదాపు 56 ప్యాకెట్లు నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వాటి విలువ సుమారు రూ. 57,660 ఉంటుందని ఎస్సై రషీద్ తెలిపారు.
ఇదీ చూడండి: మెట్రో టికెట్ ధరలపై హైకోర్టులో సీపీఎం పిటిషన్