ETV Bharat / state

ఈత నేర్చుకునేందుకు వెళ్లి యువకుడి మృతి - ఈత సరదా తీసిన ఉసురు

నల్గొండ జిల్లా మంగమ్మ గూడెం గ్రామంలోని ఓ వ్యవసాయ బావిలో ఈత నేర్చుకునేందుకని వెళ్లిన యువకుడు ప్రమాదవశాత్తు అందులోనే మునిగి చనిపోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

youngman died in nalgonda
ఈత నేర్చుకునేందుకు వెళ్లి యువకుడి మృతిఈత నేర్చుకునేందుకు వెళ్లి యువకుడి మృతి
author img

By

Published : May 25, 2020, 9:22 AM IST

నల్లగొండ జిల్లా కట్టంగూరు మండలం ఈదులూరుకు చెందిన నార్ల ప్రవీణ్ సెలవుల నిమిత్తం అమ్మమ్మ ఊరైన శాలిగౌరారం మండలంలోని మంగమ్మ గూడెం వచ్చాడు. ఈ క్రమంలోనే స్నేహితులతో కలిసి సరదాగా ఈత నేర్చుకునేందుకని వ్యవసాయ బావి వద్దకు వెళ్లాడు.

ఈత నేర్చుకునే ప్రయత్నం చేస్తుండగా... ప్రమాదవశాత్తు అదే బావిలో మునిగి చనిపోయాడు. స్నేహితుల ద్వారా విషయం తెలుసుకున్న గ్రామస్థులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని బయటకు తీసి శవపరీక్ష నిమిత్తం నకిరేకల్ ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు ఎస్​ఐ హరిబాబు తెలిపారు.

ఇవీ చూడండి: గొర్రెకుంట బావి ఘటనలో వీడిన మిస్టరీ.. ప్రేమ వ్యవహారమే కారణమా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.