నల్గొండ జిల్లా అనుముల మండలం హాలియాలోని సాగర్ కాల్వలో.. అనుముల గ్రామానికి చెందిన సంధ్య అనే యువతి దూకింది. ఇంట్లో తల్లిదండ్రులు మందలించడం వల్ల సదరు యువతి హాలియా పీఎస్ సమీపంలో ఉన్న సాగర్ కాల్వలో దూకి ఆత్మహత్య చేసుకోవడానికి వచ్చి దూకినట్లు ఆమె బంధువులు తెలిపారు.
సంధ్య కాల్వలో దూకిన సమయంలో అక్కడే ఉన్న యువకుడు నీటిలోకి దూకి యువతిని ఒడ్డుకు తీసుకొచ్చాడు. పలువురు యువకులు చేతులు పట్టుకుని యువతిని రక్షించి బయటకు తీసుకువచ్చారు. అమ్మాయిని కాపాడిన యువకులను అక్కడ ఉన్న వారు అభినందించారు.
ఇవీ చూడండి: నీళ్లల్లో పడి ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతి