ETV Bharat / state

అంతర్రాష్ట్ర చెక్​పోస్ట్​ వద్ద కార్మికుల అడ్డగింత - latest news on nagarjuna sagar interstate check post

లాక్​డౌన్​ నేపథ్యంలో రాష్ట్రంలో చిక్కుకున్న వలస కార్మికులు తమ స్వస్థలాలకు వెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. ఈ నేపథ్యంలో ఆదివారం తమ సొంతూళ్లకు వెళుతున్న కొందరు కార్మికులను సాగార్జున సాగర్​ అంతర్రాష్ట్ర చెక్​పోస్ట్​ వద్ద ఏపీ పోలీసులు అడ్డుకున్నారు. సొంతూళ్లకు వెళ్లేందుకు అనుమతి కోసం కార్మికులు నిన్నటి నుంచి పడిగాపులు కాస్తున్నారు.

Workers interrupt at interstate check post
అంతర్రాష్ట్ర చెక్​పోస్ట్​ వద్ద కార్మికుల అడ్డగింత
author img

By

Published : May 4, 2020, 5:23 PM IST

స్వరాష్ట్రాలకు వెళ్లేందుకు ప్రభుత్వం అనుమతించిన నేపథ్యంలో ఏపీకి చెందిన కొంతమంది కార్మికులు సొంత గూటికి చేరేందుకు ఆదివారం బయలుదేరారు. నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ చెక్​పోస్ట్ వద్ద ఏపీ పోలీసులు వారిని అడ్డుకున్నారు. రాష్ట్రంలోకి కార్మికులను అనుమతించడం లేదని తెలిపారు. రాత్రి వరకు అక్కడే వేచి చూచిన కార్మికులకు దాతల సహాయంతో తెలంగాణ పోలీసులు భోజనం ఏర్పాటు చేశారు. సొంతూళ్లకు వెళ్లేందుకు అనుమతుల కోసం కార్మికులు నిన్నటి నుంచి పడిగాపులు కాస్తున్నారు.

తెలంగాణ పోలీసులు వారికి నచ్చజెప్పి ఇక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్లిపోవాలని సూచించారు. ఫలితంగా మమ్మల్ని ఏపీలోకి అనుమతించక.. ఇక్కడా ఉండనివ్వకపోతే ఎక్కడకి వెళ్లాలంటూ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చూడండి: రాగల రెండు రోజుల్లో తేలికపాటి వర్షాలు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.