నల్గొండ జిల్లా నకిరేకల్ మండలం తాటికల్ గ్రామంలో పోతుల సైదులు(38) గీత కార్మికుడిగా జీవనం సాగిస్తున్నాడు. అతనికి పెళ్లైంది. ఇద్దరు కుమారులు. పక్కంట్లోనే కారింగు భవాని(32) నివసిస్తుంది. ఒక కూతురు. భర్త కొద్ది కాలం క్రితం చనిపోయాడు. సైదులు, భవానిల మధ్య పరిచయం కాస్త.. వివాహేతర సంబంధంగా మారింది. ఒకరిని విడిచి మరొకరు ఉండలేకపోయారు. ఇద్దరూ రెండు నెలల క్రితం పారిపోయారు.సైదులు భార్య బంధువులతో ఈ విషయంపై పంచాయతీ పెట్టించింది. భవానితో తిరగొద్దని బంధువులు, పెద్ద మనుషులు సైదులకు నచ్చజెప్పారు. కానీ భవానితో ప్రేమ బంధం అలాగే కొనసాగించాడు. బుధవారం ఇంట్లో ఈ విషయంపై పెద్ద గొడవ జరిగింది. మనస్థాపానికి గురైన సైదులు, భవానిలు ఎలాగూ కలిసి బతకలేమని.. చావులో ఒకటవుదామని అనుకున్నారు. గ్రామ శివారులోని మామిడి తోటలో ఇద్దరు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. భవాని కూతురు అనాథగా మారింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: దేశం దాటినా... అమ్మాయికి దక్కని ప్రేమ