ఉమ్మడి నల్గొండ జిల్లాల్లో జరిగిన సహకార సంఘాల ఎన్నికల్లో... తెరాస మద్దతుదారులు విజయంబావుటా ఎగరేశారు. నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గంలో ఏడు స్థానాల్లో ఆరింటిని తెరాస మద్దతుదారులు, ఒక సంఘాన్ని కాంగ్రెస్ మద్దతుదారులు చేజిక్కించుకున్నారు.
చింతపల్లిలో హస్తం వర్గీయులు గెలుపొందగా... దేవరకొండ, కొండమల్లేపల్లి, చిత్రియాల, తిమ్మాపురం, డిండి, తౌక్లాపూర్ సహకార సంఘాల్ని తెరాస శ్రేణులు దక్కించుకున్నాయి. నాగార్జునసాగర్ నియోజకవర్గంలో ఎనిమిది స్థానాల్లో తెరాస హవానే కొనసాగింది. సూర్యాపేట జిల్లాలోని తుంగతుర్తి నియోజకవర్గంలో ఏడింటిలోనూ తెరాస వర్గీయులే విజయబావుటా ఎగురేశారు.
ఇవీ చూడండి:శంషాబాద్లో 1100 గ్రాముల బంగారం పట్టివేత