ETV Bharat / state

సాగర్​లో విజయదుందుభి మోగించిన తెరాస - nagarjunasagar by elation result

నాగార్జున సాగర్​ ఉపఎన్నికలో తెరాస ఘన విజయం సాధించింది. విజయంతో పాటు ఓట్ల శాతం కూడా ఆ పార్టీ పెంచుకుంది. 2018లో జరిగిన సాధారణ ఎన్నికలతో పోలిస్తే తాజా ఫలితాల్లో గులాబీ పార్టీకి ఒక శాతం ఓట్లు ఎక్కువ వచ్చాయి.

సాగర్​లో తెరాస విజయం
సాగర్​లో తెరాస విజయం
author img

By

Published : May 2, 2021, 10:20 PM IST

Updated : May 3, 2021, 4:55 AM IST

రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి రేకేత్తించిన నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికలో అధికార తెరాస ఘన విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి నోముల భగత్‌ సీనియర్‌ కాంగ్రెస్‌ నేత జానారెడ్డిపై 18,872 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. గత సాధారణ ఎన్నికల్లో ఇదే స్థానంలో తెరాస 7,726 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించింది. ఇక్కడి నుంచి ఏడుసార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన జానారెడ్డి వరుసగా రెండోసారి ఓటమి పాలయ్యారు. దీంతో తెరాస తన సిట్టింగ్‌ స్థానాన్ని నిలబెట్టుకున్నట్లయింది. ఇక్కడి ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య గతేడాది డిసెంబరు 1న హఠాన్మరణం చెందడంతో ఏప్రిల్‌ 17న ఉప ఎన్నిక నిర్వహించారు. ఆదివారం ఓట్ల లెక్కింపు చేపట్టారు. తొలి రౌండ్‌ నుంచే ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీపై తెరాస సంపూర్ణ ఆధిక్యం సాధించింది. మొత్తం 25 రౌండ్లలో (ఒకచోట ఈవీఎం మొరాయించగా ఆ ఓట్లను 26వ రౌండ్‌గా లెక్కించారు) 10, 14వ రౌండ్లలో మాత్రమే కాంగ్రెస్‌ స్వల్ప ఆధిక్యం సాధించగా.. మిగిలిన రౌండ్లలో తెరాస మెజార్టీ ఓట్లను పొందింది. 2018లో జరిగిన సాధారణ ఎన్నికల్లో తెరాస అభ్యర్థి నోముల నర్సింహయ్య, జానారెడ్డిపై 7,726 ఓట్ల మెజార్టీతో గెలుపొందగా, ఈసారి మెజార్టీ 18,872 ఓట్లు కావడం విశేషం.

పెరిగిన ఆధిక్యం
తెరాస విజయకేతనం

ప్రధాన పార్టీల డిపాజిట్ల గల్లంతు
భాజపా, తెదేపా డిపాజిట్లు కోల్పోయాయి. భాజపా అభ్యర్థి రవికుమార్‌కు 7,676 ఓట్లు రాగా, తెదేపా అభ్యర్థి మువ్వా అరుణ్‌కుమార్‌కు 1,714 ఓట్లు వచ్చాయి. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన తలారి రాంబాబు 2,970 ఓట్లు పొందారు. తమ అభ్యర్థి సామాజికవర్గ ఓట్లపై ఆశలు పెట్టుకున్న భాజపాకు నిరాశే మిగిలింది. కాంగ్రెస్‌ అభ్యర్థి సామాజికవర్గ ఓట్లతో పాటు భాజపా అభ్యర్థి సామాజికవర్గ ఓట్లు అధికార పార్టీకే వెళ్లడంతో తెరాసకు భారీ మెజార్టీ వచ్చింది. 41 మంది పోటీ చేసిన ఈ ఎన్నికల్లో ప్రధాన పార్టీలు మినహాయించి మిగతావారిలో ఏడుగురికి మాత్రమే వెయ్యికిపైగా ఓట్లు వచ్చాయి. మంద కృష్ణ మాదిగ ఆధ్వర్యంలోని మహాజన సోషలిస్టు పార్టీకి 1,028 ఓట్లు దక్కాయి. కాంగ్రెస్‌ అభ్యర్థి జానారెడ్డికి వ్యక్తిగతంగా పట్టున్న సొంత మండలమైన అనుములలో కూడా తెరాస మెజార్టీ సాధించడం గమనార్హం.

పెరిగిన ఆధిక్యం
కౌంటింగ్​ను పర్యవేక్షిస్తున్న ఏజెంట్లు..

తొలిసారే విజయం
తెరాస ఎమ్మెల్యే నర్సింహయ్య మరణం కారణంగా జరిగిన ఉప ఎన్నికలో ఆ పార్టీ అభ్యర్థిగా ఆయన కుమారుడు భగత్‌ తొలిసారే విజయం సాధించారు. 20 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉన్న జానారెడ్డిని 2018లో నోముల నర్సింహయ్య ఓడించగా.. 2021లో ఆయన కుమారుడు భగత్‌ మరోసారి ఓడించారు. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లలోనూ తెరాస ఆధిక్యం కనబరిచింది. మొత్తం 1,384 ఓట్లు పోలవగా తెరాసకు 822, కాంగ్రెస్‌కు 428, భాజపాకు 30 ఓట్లు రాగా, తెదేపాకు 6 ఓట్లు వచ్చాయి.

పెరిగిన ఆధిక్యం
తెరాస ఆధిక్యం...

కేసీఆర్‌పై ఉన్న నమ్మకానికి నిదర్శనం..
ముఖ్యమంత్రి కేసీఆర్‌పై రాష్ట్ర ప్రజలకున్న నమ్మకం, విశ్వాసం సాగర్‌ గెలుపుతో మరోసారి నిరూపితమైంది. నాగార్జున సాగర్‌ ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టారు. ఇకనైనా కాంగ్రెస్‌, భాజపా నాయకులు పిచ్చి మాటలు కట్టిపెట్టాలి. తెరాసకు ఓటేసిన వారందరికీ ధన్యవాదాలు.- జగదీశ్‌రెడ్డి, మంత్రి, సాగర్‌ ఉప ఎన్నిక తెరాస ఇన్‌ఛార్జి

హామీల అమలుకు కృషి చేస్తా..
నన్ను గెలిపించిన ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటా. అందరికీ అందుబాటులో ఉండి సేవ చేస్తా. ఈ అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటాను. నియోజకవర్గ అభివృద్ధికి, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి కృషి చేస్తా.-నోముల భగత్‌, తెరాస విజేత

ఇదీ చదవండి: పక్కా వ్యూహం.. ప్రణాళిక ప్రకారం ప్రచారం

Last Updated : May 3, 2021, 4:55 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.