ఇవీ చూడండి:ఎలా పూజించాలంటే!
శివ 'ఆరాధన' - nalgonda
మహా శివరాత్రి సందర్భంగా ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ కమిటీలు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.
శివునికి ప్రత్యేక పూజలు
ఉమ్మడి నల్గొండ జిల్లాలోని శివాలయాలు భక్తజనంతో కిటకిటలాడుతున్నాయి. పానగల్లు ఛాయా సోమేశ్వరాలయంలో వేకువజాము నుంచే దర్శనాలు ప్రారంభమయ్యాయి. వాడపల్లి మీనాక్షీ అగస్త్యేశ్వర స్వామి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సూర్యాపేట జిల్లాలోని పిల్లలమర్రి నామేశ్వర ఎరకేశ్వర స్వామి ఆలయంలో ఉదయం నుంచే అభిషేకాలు చేసేందుకు భక్తులు బారులు తీరారు. జిల్లా వ్యాప్తంగా ఆలయ ప్రాంగణాలన్నీ శివనామస్మరణతో మార్మోగుతున్నాయి.
ఇవీ చూడండి:ఎలా పూజించాలంటే!
Last Updated : Mar 4, 2019, 12:29 PM IST