కేసీఆర్ నాయకత్వంలో గ్రామాలు సమగ్ర అభివృద్ధి సాధించాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఎల్బీనగర్లోని పుల్లారెడ్డి గార్డెన్లో హైదరాబాద్‌లో ఉంటున్న మునుగోడు నియోజకవర్గంలోని నాంపల్లి ఓటర్ల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న ఆయన.. రాజగోపాల్‌రెడ్డి స్వార్థం వల్లే మునుగోడు ఉప ఎన్నిక వచ్చిందని అన్నారు. రూ.18 వేల కోట్ల కాంట్రాక్టు కోసం రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేసి మునుగోడుకు ఉపఎన్నిక తీసుకొచ్చారని విమర్శించారు.
ఇదే విషయం రాజగోపాల్‌రెడ్డి స్వయంగా ఒప్పుకున్నారన్న తలసాని.. దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలు తెరాస ప్రభుత్వం అమలు చేస్తోందని వివరించారు. మునుగోడు అభివృద్ధికి ప్రజల సమస్యల పరిష్కారం కోసం తెరాస అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని గెలిపించాలని ఆయన కోరారు.
"మునుగోడులో రాజగోపాల్‌రెడ్డి స్వార్థం వల్ల ఇప్పుడు ఉపఎన్నిక వచ్చింది. రూ.18 వేల కోట్ల కాంట్రాక్టు తీసుకున్నట్టు రాజగోపాల్‌రెడ్డే స్వయంగా ఓ టీవీ కార్యక్రమంలో ఒప్పుకున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలు మన రాష్ట్రంలో అమలు అవుతున్నాయి. రాష్ట్రంలో రఘునందన్, ఈటల రాజేందర్‌ను అక్కడ గెలిపించారు. ఇంత వరకు ఏం సాధించారు. ఆయా నియోజకవర్గాలను ఏం అభివృద్ధి చేశారు. మునుగోడు అభివృద్ధి తెరాసతోనే సాధ్యం.. మీరందరూ కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని గెలిపించాలని విజ్ఢప్తి చేస్తున్నా." - తలసాని శ్రీనివాస్ యాదవ్, మంత్రి
ఇవీ చదవండి: