నల్గొండ జిల్లా దామచర్ల మండలం వాడపల్లి అంతర్రాష్ట్ర చెక్పోస్ట్ వద్ద రాష్ట్ర పోలీసులు లాక్డౌన్ను కఠినంగా అమలు చేస్తున్నారు. ఈ పాస్ ఉన్న వాహనాలను మాత్రమే రాష్ట్రంలోకి అనుమతిస్తున్నారు. వైద్యం కోసం హైదరాబాద్ వెళ్లే అంబులెన్సులు, అత్యవసర పరిస్థితుల్లో వెళ్లే వారిని మాత్రమే రానిస్తున్నారు.
జాతీయ రహదారి గుండా వెళ్లే రవాణా వాహనాలు యథావిధిగా నడుస్తున్నాయి. అనవసరంగా రోడ్లపైకి వచ్చే వారిని పోలీసులు వెనక్కి పంపుతున్నారు. ఎప్పుడూ వాహనాలతో రద్దీగా ఉండే వాడపల్లి చెక్పోస్ట్.. పోలీస్ ఆంక్షలతో నిర్మానుష్యంగా మారింది.
ఇదీ చదవండి: Eatala Rajender: నారదాసు లక్ష్మణ్ రావును అడ్డకున్న ఈటల వర్గీయులు