కరోనా నేపథ్యంలో గత నాలుగు నెలలుగా వేతనాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలంగాణ ప్రైవేటు ఉపాధ్యాయుల ఫోరం అధ్యక్షుడు రవీందర్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా భృతి ఇచ్చి ప్రభుత్వం తమను ఆదుకోవాలని నిర్మల్‌లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి వినతి పత్రం అందజేసింది.
ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు తమకు వేతనాలు చెల్లించడం లేదని వాపోయారు. వేతనాలు లేక తమ కుటుంబాలు ఆర్థికంగా చితికిపోయాయని రవీందర్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమకు చేయూతనందించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన మంత్రి జిల్లా కలెక్టర్‌తో మాట్లాడుతానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి శేఖ్ అన్సార్ పాషా, ఉపాధ్యక్షులు కట్ట లివింగ్ స్టన్, సహాయ కార్యదర్శి అర్షద్ పాషా పాల్గొన్నారు.
ఇదీ చదవండి : 'కూలుతున్నది సచివాలయమే కాదు తెలంగాణ బతుకులు'