ETV Bharat / state

Vaccine: జిల్లాలో సూపర్ స్పైడర్​లకు వ్యాక్సిన్

జిల్లాలో సూపర్ స్పైడర్​లకు వ్యాక్సిన్ కార్యక్రమం మొదలైంది. రద్దీ దృష్ట్యా అధికారులు అన్ని ఏర్పాట్లూ తీసుకుంటున్నారు. జర్నలిస్టులకు సైతం వ్యాక్సిన్ ఇస్తున్నారు.

నల్గొండ జిల్లాలో వ్యాక్సినేషన్
నల్గొండ జిల్లాలో వ్యాక్సినేషన్
author img

By

Published : May 28, 2021, 6:53 PM IST

నల్గొండ జిల్లా మిర్యాలగూడ లోని బకాల్వడా హై స్కూల్​లో ఏర్పాటు చేసిన టీకా కేంద్రంలో సూపర్ స్పైడర్​లకు వ్యాక్సిన్ కార్యక్రమం మొదలైంది. రద్దీని దృష్టిలో పెట్టుకొని 5 వ్యాక్సిన్ కౌంటర్లను ఏర్పాటు చేశారు. సులువుగా వ్యాక్సిన్లను వేసుకొనే విధంగా వైద్యాధికారులు ఏర్పాటు చేశారు.

వంట గ్యాస్ సరఫరా దారులు, కిరాణా దుకాణం యజమానులు, గుమస్తాలు, పెట్రోల్ బంకు యజమానులు, కార్మికులు, వ్యవసాయ అనుబంధ వ్యాపారం చేసేవారు వీరందరిని ప్రభుత్వం సూపర్ స్పైడర్​లుగా గుర్తించింది. వారికి ఈ రోజు నుంచి మూడు రోజుల పాటు వ్యాక్సిన్ వేసే విధంగా అన్ని ఏర్పాట్లు చేశారు. డిప్యూటీ డీఎంహెచ్​ఓ డాక్టర్ రవి వ్యాక్సినేషన్ ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు.

జర్నలిస్టులకు...

జర్నలిస్టులను రాష్ట్ర ప్రభుత్వం ఫ్రంట్ లైన్ వర్కర్లుగా గుర్తించడంతో.. వారికి కూడా వ్యాక్సిన్ వేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా ఫ్రంట్ లైన్ వారియర్లుగా గుర్తించినందుకు ధన్యవాదాలు తెలిపారు. కరోనా బారిన పడి చనిపోయిన జర్నలిస్టులకు తక్షణ సహాయం రూ.లక్ష ఇవ్వాలని కోరారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.