ETV Bharat / state

పైరవీలకే పట్టం.. ప్రాణవాయువు కోసం పోరాటం

కరోనా మహమ్మారి.. ఊపిరితిత్తుల్లో చేరి ఊసురు తీసేస్తోంది. ఆక్సిజన్ అందుబాటులో లేకపోతే క్షణాల్లోనే ఆయువు తీసేస్తోంది. కొవిడ్ రెండో దశ విజృంభిస్తోన్న నేపథ్యంలో.. ప్రభుత్వాసుపత్రుల్లో ఆక్సిజన్ పడకల కొరత పెరిగింది. సర్కారు దవాఖానాలకు వచ్చేది సాధారణ రోజుల్లోనైతే పేదవారు మాత్రమే. ఇప్పుడు పెద్దవారికి సైతం అవి అవసరమొస్తున్నాయి. ప్రాణాన్ని నిలుపుకొనేందుకు తెలిసినవారితో పైరవీలు చేస్తూ పడకల్ని దక్కించుకుంటున్నారు. దీంతో సర్కారు ఆసుపత్రులు.. కొన్నిచోట్ల కాసుపత్రులుగా మారాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఆక్సిజన్ పడకలు దొరకని పరిస్థితి నెలకొన్న తీరుపై ఈటీవీ భారత్​ ప్రత్యేక కథనం.

Problems with oxygen deficiency
Problems with oxygen deficiency
author img

By

Published : Jun 6, 2021, 2:51 PM IST

కరోనా రెండో దశ ఉద్ధృతితో ప్రాణావాయువు కోసం రోగులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. నల్గొండ ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వాసుపత్రుల్లో.. ఖాళీ పడకలు లేకపోవడంతో చాలామంది ప్రైవేటు దవాఖానాల్ని ఆశ్రయిస్తున్నారు. నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో ప్రస్తుతానికి ఒకట్రెండుకు మించి ఆక్సిజన్‌ పడకలు ఖాళీగా లేవంటే రోగుల తాకిడి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆయా జిల్లాల జనరల్‌ ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌ ట్యాంకులు ఉండగా మిగతా చోట్ల సిలిండర్ల ద్వారా ప్రాణవాయువును అందిస్తున్నారు. ట్యాంకులు లేని ప్రాంతాల్లో సిలిండర్లు వాడుతుండటం వల్ల నిత్యం పెద్ద ఎత్తున వెచ్చించాల్సి వస్తోంది. మిర్యాలగూడలో 40 పడకలకు.. ఒక్కో పడకకు ఒక్కో సిలిండర్‌ వినియోగించడం వల్ల రోజూ రూ.35 వేల దాకా ఖర్చవుతోంది. అక్కడ ఇంకో 20 పడకల కోసం స్థలం చూసి నిర్మాణానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక అన్ని వైద్యశాలల్లోనూ అదనపు పడకలు ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి నెలకొంది.

ఉమ్మడి జిల్లాలో స్వల్ప ఖాళీలు..

నల్గొండ జిల్లా జనరల్ ఆసుపత్రితోపాటు ఏరియా ఆసుపత్రులు కొవిడ్ రోగులతో రద్దీగా మారాయి. దేవరకొండ, మిర్యాలగూడ, నాగార్జునసాగర్ దవాఖానాల్లో పడకలను పెద్ద సంఖ్యలో కరోనా బాధితులకు కేటాయించారు. ఆక్సిజన్ పడకలు జిల్లా ఆసుపత్రిలో 190, దేవరకొండలో 50, మిర్యాలగూడలో 40, సాగర్​లో 40, నకిరేకల్​లో 2 ఉన్నాయి. అందులో 95 శాతం నిండిపోగా, 5 శాతం మాత్రమే ఖాళీలున్నాయి. సూర్యాపేట జిల్లా జనరల్ ఆసుపత్రిలో 190, హుజూర్ నగర్​లో 5 ప్రాణవాయువు పడకలు ఉండగా.. 99 శాతం నిండిపోయాయి. ఈ రెండు జిల్లాల పరిధిలో నిత్యం 20 నుంచి 30 మంది ఆక్సిజన్ కోసం ఎదురుచూస్తూ సాధారణ పడకల్లో కాలం గడుపుతున్నారు. యాదాద్రి జిల్లా ఆసుపత్రిలో 20, ఎయిమ్స్​లో 24, ఆలేరు సీహెచ్​సీలో 21, చౌటుప్పల్ సీహెచ్​సీలో 5, రామన్నపేట సీహెచ్​సీలో 4 పడకల్ని కేటాయిస్తే.. అందులో 43 శాతం పడకల్లో రోగులు ఉన్నారు. మిగతా 57 శాతం ఖాళీగా ఉన్నాయి. సూర్యాపేట జిల్లా వైద్యాలయంలో 12 టన్నుల ట్యాంకు.. 190 పడకలకుగాను 5 రోజులు వస్తోంది. గతంలో 12 టన్నుల ట్యాంకు 2 నెలలు వచ్చేది. ప్రాణవాయువు అవసరం ప్రస్తుతం ఏ మేరకు ఉందో దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు.

పైరవీలకే పట్టం..

ప్రభుత్వాసుపత్రులకు వచ్చేది సాధారణ రోజుల్లోనైతే పేదవారు మాత్రమే. ఇప్పుడు పెద్దవారికి సైతం సర్కారు దవాఖానాలు అవసరమొస్తున్నాయి. ప్రాణాన్ని నిలుపుకొనేందుకు తెలిసినవారితో పైరవీలు చేస్తూ పడకల్ని దక్కించుకుంటున్నారు. రోగి అత్యవసర స్థితిని బట్టి ఆక్సిజన్‌ ఇవ్వాలా, వద్దా అనేది నిర్ణయించాలి. కానీ అవేమీ చూడకుండా.. పైరవీలతోనే పని కానిచ్చేస్తున్నారు. ప్రాణవాయువు అత్యవసరమైన నిరుపేదలు, మధ్యతరగతి వ్యక్తులు.. ప్రైవేటును ఆశ్రయిస్తున్నారు. ఆక్సిజన్‌, మందులు, వైద్యుల ఖర్చు.. వెరసి నిత్యం రూ.40 వేల నుంచి రూ.50 వేల వరకు విదిల్చుకుంటున్నారు. ప్రైవేటు దవాఖానాల్లో ఫిజిషియన్‌, పల్మనాలజిస్ట్‌ వంటి స్పెషలిస్టులు చూడాల్సిన కొవిడ్‌ రోగుల్ని సాధారణ వైద్యులే పరీక్షించి వైద్యం చేస్తున్నారు. ఊపిరితిత్తుల్లో ఎలా ఉందనేది నిర్ధరించకపోవడంతో దేవరకొండ ఆసుపత్రుల్లో పరిస్థితి చేయి దాటి హైదరాబాద్​కు వెళ్లినవారిలో.. ఈ ఇటీవల 8 నుంచి 10 మంది దాకా ప్రాణాలు కోల్పోయారు.

కాసుపత్రులు..

సర్కారు ఆసుపత్రులు.. కొన్నిచోట్ల కాసుపత్రులుగా మారాయి. వైద్యం కోసం వచ్చే రోగికి సహాయకుడిగా సేవలందించేందుకు గతంలో ప్రతి చోట కొంతమందిని ఒప్పంద ప్రాతిపదికన నియమించారు. వారు ఇప్పటికీ కొనసాగుతుండగా.. అన్ని చోట్లా వారిదే ఆధిపత్యం కొనసాగుతోంది. కొన్నిచోట్ల వైద్యులు అందుబాటులో లేని సమయంలో ఈ సహాయకులే అన్నీ తామై చూస్తున్నారు. వాస్తవానికి వారు వైద్యులా, సహాయకులా అన్నది కూడా నిర్ధారించుకోలేని పరిస్థితి నెలకొంది. ఒక కొవిడ్ బాధితుడు 10 రోజులు ఆక్సిజన్ పొంది.. డిశ్చార్జ్​ అయ్యే సమయంలో ఆ రోగి నుంచి రూ.5 నుంచి రూ.10 వేల వరకూ ఈ సహాయకులే వసూలు చేస్తూ అజమాయిషీ చెలాయిస్తున్నారు.

ఇదీ చదవండి: CM KCR: ఈ నెల 9న డయాగ్నోస్టిక్‌ కేంద్రాల ప్రారంభం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.