ETV Bharat / state

అతను కుంచె పడితే రక్తం ఉప్పొంగుతోంది! - నల్గొండ జిల్లా వార్తలు

ఒక్క చిత్రం వేల భావాల సమాహారం. రచయిత వెయ్యి మాటల్లో చెప్పే భావాల్ని చిత్రకారుడు చిన్న బొమ్మ ద్వారా వ్యక్తం చేయగలడు. మాటలకంటే చిత్రాలే మనసుపై చెరగని ముద్ర వేస్తాయి. నల్గొండ జిల్లాకు చెందిన ఓ చిత్రకారుడు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట చరితను ప్రతిబించేలా చిత్రాలు గీస్తున్నాడు. ఆయన కుంచె నుంచి జాలువారిన ఒక్కొ చిత్రం విప్లవాన్ని రగిలిస్తోంది.

painting
painting
author img

By

Published : Sep 16, 2020, 2:03 PM IST

ఈయన కుంచె పడితే చరిత్ర కళ్లకు కడుతుంది...

నల్గొండ జిల్లా చండూరు మండలం కొండాపురానికి చెందిన బరిగెల శ్రీనివాస్​... తన కుంచెతో సామాజిక అంశాలపై చిత్రాలు గీస్తూ ప్రజల్లో చైతన్యాన్ని రగిలిస్తున్నాడు. విద్యాభ్యాసం నుంచే నోట్​బుక్స్​పై అలవోకగా చిత్రాలు గీసేవాడు. కమ్యూనిజం భావజాలం ఉన్న శ్రీనివాస్... కమ్యూనిస్టు చరిత్ర, పేదల బతుకు వెతలపై గీసిన చిత్రాలు ఆలోచింపజేస్తున్నాయి.

శ్రీనివాస్​ది నిరుపేద కుటుంబం. పీజీ వరకు చదివాడు. సామాజిక అంశాలపై, విప్లవ చరిత్రలపై చిత్రాలు గీయడమంటే చిన్ననాటి నుంచి ఆసక్తి. గురువు లేకుండానే సొంతంగా సాధన చేసి... అలవోకగా చిత్రాలు గీస్తున్నాడు. సెప్టెంబర్ 17 విమోచన దినోత్సవాన్ని పురష్కరించుకుని... తెలంగాణ సాయుధ పోరాటాన్ని తన కుంచె ద్వారా కళ్లకు కడుతున్నాడు. ఆయన వేసిన లైవ్ పెయింటింగ్స్​ విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

సాయుధపోరాటంలో మహిళల పాత్ర, ఎర్రబెండా పట్టుకుని తుపాకీకి ఎదురొడ్డి పోరాటం చేస్తున్న చిత్రం, అమరవీరుల స్థూపం వద్ద ఒక ఉద్యమకారుడు రజాకారుల తుపాకీ గొట్టానికి చేతిని అడ్డం పెట్టి కొడవలిని ఎత్తి పోరాటానికి సిద్ధంగా ఉన్న మరో చిత్రం... చరిత్రకు అద్దం పట్టేలా ఉన్నాయి. శ్రీనివాస్ చిత్రాల్లో ప్రజాపోరాటలు ప్రతిబింబిస్తాయి.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.