పాడిరైతులు బ్యాంకు రుణాలను సద్వినియోగం చేసుకోవాలని శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి సూచించారు. శ్వేత విప్లవ పితామహుడు వర్గీస్ కురియన్ జయంతిని పురస్కరించుకుని నల్గొండ జిల్లా త్రిపురారం మండలం బాబాసాయిపేటలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. గతంలో పాలఉత్పత్తిదారుల సంఘంలో పనిచేసిన అనుభవంతో పాడి రైతులకు పలు సూచనలు చేశారు.
యూఎన్డీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో బ్యాంకుల రుణ సదుపాయాలు, పాల ఉత్పత్తులపై ఈ సమావేశంలో వివరించారు. పాడి పరిశ్రమపై ఆధారపడి చాలా కుటుంబాలు అభివృద్ధి చెందాయని గుత్తా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య, పాల సహకారసంఘం సభ్యులు, రైతులు పాల్గొన్నారు.