నల్గొండ జిల్లా చందంపేట మండలం ఎస్సెల్బీసీ టన్నెల్ బోరింగ్ మిషన్ టెక్నికల్ కార్మికులుగా పని చేస్తున్న తమకు గత ఎనిమిది నెలలుగా జీతాలు ఇవ్వడంలేదని వారు ఆందోళన చేపట్టారు. వేతనాలు లేకు తమ కుటుంబాలు దుర్భర జీవితాలను గడుపుతున్నాయని అన్నారు. స్థానికులే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వారూ ఇక్కడ పని చేస్తున్నారని వారు తెలిపారు.
యాజమాన్యాన్ని జీతాల విషయమై అడగగా బడ్జెట్ లేని కారణంగా జీతాలు ఇవ్వడం లేదని చెబుతున్నారన్నారని వాపోయారు. అర్థాకలితో అలమటిస్తున్న తమను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదుకుని జీతాలు అందేలా చర్యలు తీసుకోవాలని కార్మికులు కోరుతున్నారు.
ఇదీ చూడండి: బాలిక అభ్యర్థనపై స్పందించిన కలెక్టర్.. స్మార్ట్ఫోన్ కానుక